SL vs NZ 2nd Test : సొంతగడ్డపై శ్రీలంక బ్యాటర్లు బాదేస్తున్నారు. రెండో టెస్టులోనూ న్యూజిలాండ్ బౌలర్లను ఉతికేస్తూ జట్టుకు భారీ స్కోర్ అందించారు. అచ్చొచ్చిన గాలే స్టేడియంలో దినేశ్ చండీమాల్(116) సెంచరీతో చెలరేగగా.. ఆ తర్వాత వచ్చిన ఏంజెలో మాథ్యూస్(78 నాటౌట్), కమింద్ మెండిస్(51 నాటౌట్)లు అర్ధ శతకాలతో విరుచుకుపడగా కివీస్ బౌలర్లు నీరుగారిపోయారు. దాంతో.. తొలి రోజే శ్రీలంక భారీ స్కోర్ సాధించి ప్రత్యర్థిని ఒత్తిడిలో పడేసింది. ఆట ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి పరుగులు చేసింది.
స్వదేశంలో తాము ఎంత ప్రమాదకరమో శ్రీలంక ఆటగాళ్లు మరోసారి చాటారు. ఆదిలోనే న్యూజిలాండ్ కెప్టెన్ సౌథీ ఓపెనర్ పథుమ్ నిశాంక(1)ను వెనక్కి పంపినా లంక బ్యాటర్లు ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వలేదు. మరో ఓపెనర్ దిముత్ కరుణరత్నే(46) అండగా దినేశ్ చండీమల్(116) ఇన్నింగ్స్ నిర్మించాడు. క్రీజులో కుదురుకున్నాక భారీ షాట్లతో కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
A second-innings half-century in the first, and now a century in the first innings of the second Test!
It’s turning out to be a fine series for Dinesh Chandimal at No. 3#SLvNZ https://t.co/mD2JJ1pyh5 pic.twitter.com/Jn6a2ixnbi
— ESPNcricinfo (@ESPNcricinfo) September 26, 2024
చండీమల్, కరుణరత్నేల జోడీ సరుగులు దొంగిలిస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. అయితే.. హాఫ్ సెంచరీకి చేరువైన కరుణరత్నే.. గ్లెన్ ఫిలిఫ్స్ మెరుపు త్రోతో పెవిలియన్ చేరాడు. అక్కడితే రెండో వికెట్‌కు 123 పరుగులతో లంక ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేసిన ఈ జోడీ విడిపోయింది. అయినా సరే చండీమాల్ జోరు తగ్గించలేదు. సీనియర్ ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్(78 నాటౌట్) సహకారంతో మరింత ధాటిగా ఆడి శతకగర్జన చేశాడు. ఆ కాసేపటికే ఫిలిఫ్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయి మూడో వికెట్‌గా వెనుదిరిగాడు.
చండీమాల్ వికెట్ తీసిన ఆనందం న్యూజిలాండ్‌కు ఎంతోసేపు నిలవలేదు. తొలి టెస్టు సెంచరీ హీరో కమిందు మెండిస్(51 నాటౌట్) మరోసారి కివీస్ బౌలర్లకు పరీక్ష పెడుతూ అర్ధ శతకంతో రాణించాడు. దాంతో, ఆతిథ్య లంక తొలి రోజు ఆట ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 306 రన్స్ కొట్టింది. రెండో రోజు వీళ్లిద్దరూ తొలి సెషన్లో నిలబడితే న్యూజిలాండ్‌కు ఇక కష్టకాలమే.
Glenn Phillips brings the breakthrough for New Zealand. Dinesh Chandimal departs in an attempt to go over mid-on#SLvNZ https://t.co/mD2JJ1pyh5 pic.twitter.com/DrOkodlAxt
— ESPNcricinfo (@ESPNcricinfo) September 26, 2024