అమరావతి : ఏపీలో వైసీపీకి రాజీనామా చేసిన ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు జనసేన (Janasena ) పార్టీలో చేరారు. గురువారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ( Pawan Kalyan) సమక్షంలో పార్టీలో చేరారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి (Balineni Srinivas reddy) , సామినేని ఉదయభాను, కిలారి రోశయ్యతో పాటు వారి అనుచరులు జనసేనలో చేరిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా జనసేన కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఏపీలో అధికార మార్పిడి జరిగిన తరువాత అంతుకు ముందు వైసీపీలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేసిన కీలక నాయకులు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన పార్టీలో చేరారు. తాజాగా ముగ్గురు రాజ్యసభ సభ్యులు సైతం తమ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మోపినేని వెంకట రమణ, బీద మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇంకా వారు ఏ పార్టీలో చేరుతారనది స్పష్టం చేయలేదు.