IND vs ENG : లార్డ్స్ టెస్టులో భారత పేసర్ల విజృంభణతో ఇంగ్లండ్ రెండో సెషన్లోనే ఆలౌటయ్యింది. జస్ప్రీత్ బుమ్రా(5-74) ఇంగ్లండ్ బ్యాటింగ్ యూనిట్‌ను కకావికలం చేశాడు. తొలి సెషన్లో మూడు వికెట్లతో ఆతిథ్య జట్టును దెబ్బతీసిన స్పీడ్‌స్టర్.. లంచ్ తర్వాత ఆర్చర్‌ను బౌల్డ్ చేసి ఐదో వికెట్ సాధించాడు. ఒకదశలో 271కే ఏడు వికెట్లు పడినా.. బ్రాండన్ కార్సే(56), వికెట్ కీపర్ జేమీ స్మిత్(51)ల అసమాన పోరాటంతో స్టోక్స్ సేన కోలుకుంది. వీళ్లిద్దరూ ఎనిమిదో వికెట్‌కు 84 పరుగుల కీలక భాగస్వామ్యంతో భారీ స్కోర్ అందించారు. అర్ధ శతకం తర్వాత జోరు పెంచిన కార్సే.. సిరాజ్ సంధించిన స్లో బాల్‌కు బౌల్డ్ కావడంతో 387 పరుగులకే ఇంగ్లండ్ కుప్పకూలింది.
బర్మింగ్హమ్లో సూపర్ విక్టరీతో సిరీస్ సమం చేసిన భారత జట్టు లార్డ్స్‌లోనూ పట్టుబిగించే దిశగా సాగుతోంది. రెండో రోజు తొలి సెషన్లో నిప్పులు చెరిగిన బుమ్రా (5-74) ఇంగ్లండ్ మిడిలార్డర్‌ను చకచకా చుట్టేశాడు. సిరాజ్ (2-85) కూడా ఓ చేయి వేయడంతో రెండో సెషన్లోనే ఆతిథ్య జట్టు ఆలౌటయ్యింది. రెండో కొత్త బంతితో చెలరేగిన అతడు బెన్ స్టోక్స్(44), జో రూట్(114) లను బౌల్డ్ చేసి ఆతిథ్య జట్టు నడ్డివిరిచాడు. అయితే.. రెండో టెస్టులో మాదిరిగానే టెయిలెండర్లు ఈసారీ ప్రతిఘటించారు.
Innings Break!
England are all out for 387 in the 1st innings
Jasprit Bumrah the pick of the bowlers with 5/74 🙌
Scorecard ▶️ https://t.co/X4xIDiSUqO#TeamIndia | #ENGvIND pic.twitter.com/0bkkeqskhe
— BCCI (@BCCI) July 11, 2025
ఏడు వికెట్ల పడి ఆలౌట్ అంచున నిలిచిన ఇంగ్లండ్‌ను వికెట్ కీపర్ జేమీ స్మిత్ (51) మరోసారి ఆదుకున్నాడు. 5 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కేఎల్ రాహుల్ క్యాచ్ జారవిడవడంతో బతికిపోయిన స్మిత్.. అర్ద శతకంతో ఆదుకున్నాడు. పేసర్ బ్రాండన్ కార్సే(56)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు విలువైన 84 రన్స్ రాబట్టాడు. లంచ్ తర్వాతి ఓవర్లో స్మిత్‌ను ఔట్ చేసిన సిరాజ్ వికెట్ల వేటకు తెరతీశాడు. ఆ తర్వాత ఆర్చర్‌ను బౌల్డ్ చేసిన బుమ్రా ఐదో వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. లార్డ్స్ మైదానలో అతడు ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం ఇదే మొదటిసారి. ఓ వైపు వికెట్లు పడుతున్నా ధాటిగా ఆడి హాఫ్ సెంచరీ బాదిన కార్సేను సిరాజ్ బౌల్డ్ చేయడంతో 387 వద్ద ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది.
Mohd. Siraj gets the eighth wicket for #TeamIndia 👌👌
Jamie Smith departs for 51.
Updates ▶️ https://t.co/X4xIDiSmBg#ENGvIND | @mdsirajofficial pic.twitter.com/ral8dncL4f
— BCCI (@BCCI) July 11, 2025