Jaspreet Bumrah : ప్రమాదకరమైన బౌలింగ్ శైలితో బ్యాటర్ల గుండెల్లో గుబులు పుట్టించే జస్ప్రీత్ బుమ్రా (Jaspreet Bumrah) లార్డ్స్ టెస్టులో పంజా విసిరాడు. తన పేస్ పవర్ చూపిస్తూ సూపర్ స్పెల్‌తో ఇంగ్లండ్ టాపార్డర్‌ను కూల్చి ఐదు వికెట్లు పడగొట్టాడీ వరల్డ్ నంబర్ 1. ఆర్చర్‌ను బౌల్డ్ చేసి లార్డ్స్ హా ర్స్ బోర్డు(Lords Honours Board)లో చోటు దక్కించుకున్న ఈ పేస్ గన్.. విదేశీ గడ్డపై అత్యధిక పర్యాయాలు ఐదేసి వికెట్లు తీసిన తొలి ఇండియన్‌గా చరిత్ర సృష్టించాడు.
ఈ క్రమంలోనే భారత దిగ్గజం కపిల్ దేవ్ (Kapil Dev) రికార్డు బద్ధలు కొట్టాడు బుమ్రా. విదేశీ పర్యటనలో ఈ యార్కర్ కింగ్ ఐదు వికెట్లు తీయడం ఇది 13వ సారి. దాంతో, కపిల్ రెండో స్థానానికి పడిపోయాడు. మొత్తంగా చూస్తే.. సుదీర్ఘ ఫార్మాట్లో ఈ స్పీడ్‌స్టర్ పదిహేనోసారి ఈ ఘనత సాధించాడు. బుమ్రా 35 మ్యాచుల్లో ఈ మైలురాయికి చేరుకోగా.. కపిల్‌కు 66 గేమ్స్ పట్టింది.
Jasprit Bumrah has picked up yet another five-wicket haul, his fifteenth overall. The pacer registered his 13th fifer away from home in just 35 matches, breaking Kapil Dev’s record of 12 in 66 games.
More on this unique milestone ➡️ https://t.co/ejwqcKI2YQ#ENGvIND | #LordsTest pic.twitter.com/BLGzEVPN0x
— Sportstar (@sportstarweb) July 11, 2025
వరల్డ్ నంబర్ వన్ పేసర్ అయిన బుమ్రా లార్డ్స్‌లో నిప్పులు చెరిగాడు. తొలి రోజు ఆఖరి సెషన్లో నంబర్ 1 బ్యాటర్ హ్యారీ బ్రూక్(11)ను బౌల్డ్ చేసిన ఈ పేసర్.. రెండో రోజు మరింత రెచ్చిపోయాడు. క్రీజులో పాతుకుపోయిన బెన్ స్టోక్స్(44), సెంచరీ వీరుడు జో రూట్(104)లను బౌల్డ్ చేసి ఇంగ్లండ్‌కు షాకిచ్చాడు. అంతేనా.. క్రిస్ వోక్స్‌ను డకౌట్ చేసి ఆతిథ్య జట్టు కష్టాలను మరింత పెంచాడు. లంచ్ తర్వాత బంతి అందుకున్న బుమ్రా టెయిలెండర్ ఆర్చర్‌ను బౌల్డ్ చేయడం ద్వారా ఐదు వికెట్ సాధించాడు.