BRS | చిగురుమామిడి, జూలై 11: సింగిల్ విండో మాజీ చైర్మన్ గంప వీరయ్య స్వగ్రామం బొమ్మనపల్లిలో గుండెపోటుతో మృతి చెందడం బీఆర్ఎస్ పార్టీకి తీరనిలోటని హుస్నాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ అధికార ప్రతినిధి ఐలేని మల్లికార్జున్ రెడ్డి అన్నారు. మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో గంప వీరయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి శుక్రవారం నివాళులర్పించారు.
అనంతరం మాట్లాడుతూ ఏ పార్టీలో ఉన్న క్రమశిక్షణ అంకితభావంతో పనిచేసే గొప్ప వ్యక్తిని అన్నారు. సింగిల్ విండో చైర్మన్ గా రైతులకు అనేక సేవలు అందించాలని కొనియాడారు. వారి కుమారులు గంప చంద్రశేఖర్, మదన్మోహన్, రాజులను మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట సింగిల్ విండో మాజీ చైర్మన్ తేరాల సత్యనారాయణ, హుస్నాబాద్ ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు బడుకోలు సురేందర్ రెడ్డి, పరశురాములు, గంప సంపత్, ఎండి సోహెల్ తదితరులున్నారు.