ఇల్లెందు జులై 11 : ఇల్లెందు మున్సిపాలిటీ పారిశుధ్య సిబ్బందికి స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య శుక్రవారం పారిశుధ్య కిట్లను పంపిణీ చేశారు. మున్సిపల్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇల్లెందు పట్టణం గోవింద్ సెంటర్ పాకాల రోడ్డు సెంట్రల్ డివైడర్ మధ్యలో, అలాగే చెరువు కట్ట లేక్ పార్క్ నందు మున్సిపాలిటీ సిబ్బంది, స్థానిక నాయకులు, మహిళా సంఘాలతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ మేనేజర్ అంకుషావలి, డీఈ మురళి, మాజీ మున్సిపల్ చైర్మన్లు దమ్మలపాటి వెంకటేశ్వరరావు, ఎదలపల్లి అనసూర్య, మాజీ కౌన్సిలర్లు, నాయకులు సుదర్శన్ కోరి, మడుగు సాంబమూర్తి, డానియేలు, పింగిలి నరేశ్, చిల్ల శ్రీను, బొల్లం సూర్యం, జానీ, సదానందం, మండలి రాము పాల్గొన్నారు.
Yellandu : పారిశుధ్య సిబ్బందికి ఎమ్మెల్యే కోరం కనకయ్య కిట్ల పంపిణీ