INDW vs SAW : రెండో టీ20లోనూ దక్షిణాఫ్రికా బ్యాటర్లకు కళ్లెం వేడయంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. తొలి మ్యాచ్‌లో అర్ధ సెంచరీతో చెలరేగిన తంజిమ్ బ్రిట్స్(52) మళ్లీ మెరిసింది. ఆఖర్లో అన్నెకె బొస్చ్ (40), అన్నెరీ డెర్కెన్సన్(12)లు ధనాధన్ ఆడి జట్టు స్కోర్ 170 దాటించారు. ఈ మ్యాచ్‌లో భారత అమ్మాయిల ఫీల్డింగ్ కూడా సఫారీలకు కలిసొచ్చింది. చివరి రెండు ఓవర్లలో 31 పరుగులు రావడంతో దక్షిణాఫ్రికా హర్మన్‌ప్రీత్ కౌర్ సేన ముందు భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది.
భారత పర్యటనలో వన్డే, టెస్టు సిరీస్‌లో ఓడిన దక్షిణాఫ్రికా టీ20ల్లో తడాఖా చూపిస్తోంది. చిదంబరం స్టేడియం వేదికగా తొలి మ్యాచ్‌లో విక్టరీ కొట్టిన లారా వాల్వార్డ్త్ బృందం రెండో మ్యాచ్‌లోనూ టీమిండియాకు భారీ టార్గెట్ అప్పగించింది. కెప్టెన్ లారా వొల్వార్డ్త్(22), ఆల్‌రౌండర్ మరిజానె కాప్(20)లు స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగినా.. ఓపెనర్ తంజిమ్ బ్రిట్స్(52) వరుసగా రెండో ఫిఫ్టీతో కదం తొక్కింది.
South Africa set themselves up nicely, 89-2 after 10 overs
LIVE: https://t.co/On1XmYcPLH pic.twitter.com/CLiAK7G9j9
— ESPNcricinfo (@ESPNcricinfo) July 7, 2024
దీప్తి శర్మ ఓవర్లో బ్రిట్స్ ఔటయ్యాక వచ్చిన బోస్చ్(40) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. ఇక ఆఖరి రెండు ఓవర్లలో టెయిలెండర్లు 31 రన్స్ పిండుకున్నారు. దాంతో, నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 రన్స్ కొట్టింది. భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్(2/37), దీప్తి శర్మ(3/20)లు రెండేసి వికెట్లతో రాణించారు.