NZ vs PAK : న్యూజిలాండ్ గడ్డపై పాకిస్థాన్‌కు మరో భారీ పరాజయం. ఇప్పటికే పొట్టి సిరీస్ కోల్పోయిన పాక్ వన్డే సిరీస్‌లోనూ వైట్‌వాష్‌కు గురైంది. శనివారం జరిగిన మూడో వన్డేలో కివీస్ 43 పరుగుల తేడాతో గెలుపొందింది. ఓపెనర్ రైస్ మరియా(58), కెప్టెన్ మైఖేల్ బ్రాస్‌వెల్(59, 1-39) ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టారు. అనంతరం 264 పరుగుల ఛేదనలో బాబర్ ఆజం(50),కెప్టెన్ రిజ్వాన్(37) లు మాత్రమే రాణించారు. దాంతో, పాకిస్థాన్ 221కే పరిమితమై ఆతిథ్య జట్టుకు వన్డే సిరీస్ సమర్పించుకుంది.
వర్షం కారణంగా 42 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ జయభేరి మోగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 8 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. పాక్ పేసర్లను ఉతికారేస్తూ ఓపెనర్ రైస్ మరియా(58) అర్ధ శతకంతో కదం తొక్కాడు. మిడిలార్డర్లో హెన్రీ నికోలస్(31), డారిల్ మిచెల్(43)లు రాణించగా.. కెప్టెన్ మైఖేల్ బ్రాస్‌వెల్(50) హాఫ్ సెంచరీతో జట్టుకు భారీ స్కోర్ అందించాడు.
A series sweep to end the 24/25 New Zealand Summer of Cricket! Ben Sears leading the charge again with successive five-wicket bags and career-best ODI figures (5-34). Catch-up on all scores | https://t.co/fwZlrRKJKE 📲 #NZvPAK #CricketNation pic.twitter.com/C410af5x9A
— BLACKCAPS (@BLACKCAPS) April 5, 2025
ఇక ఛేదనలో శుభారంభం లభించినా పాక్ బ్యాటర్లు సద్వినియోగం చేసుకోలేదు. 73 వద్ద తొలి వికెట్‌గా అబ్దుల్ షఫీక్ వెనుదిరిగాక.. పాక్ ఇన్నింగ్స్ తడబడుతూ సాగింది. పేసర్ బెన్ సియర్స్(5-34) విజృంభణతో పాక్ బ్యాటర్లు చేతులెత్తేశారు. బాబర్ ఆజం(50), సారథి రిజ్వాన్(37)లు పోరాడినా చివరిదాకా నిలబడలేకపోయారు. సుఫీయన్ మకీమ్(2)ను సియర్స్ ఔట్ చేయడంతో పాక్ ఇన్నింగ్స్ 221 వద్ద ముగిసింది. బ్యాటుతో, బంతితో చెలరేగిన బ్రాస్‌వెల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డుకు ఎంపికవగా..వరుసగా రెండు మ్యాచుల్లో 5 వికెట్లు తీసిన బెన్ సియర్స్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ ట్రోఫీ అందుకున్నాడు.
Ben Sears with a second successive five-wicket haul 🙌#NZvPAK 📝: https://t.co/PvzafAZEFH pic.twitter.com/FKM5dHo8TM
— ICC (@ICC) April 5, 2025