IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ డబుల్ హెడర్‌లో పంజాబ్ కింగ్స్(Punjab Kings), రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) తలపడుతున్నాయి. వరుస విజయాలతో జోరుమీదున్న పంజాబ్ హ్యాట్రిక్‌పై కన్నేయగా.. చెన్నైపై గెలుపొందిన రాజస్థాన్ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. టాస్ గెలిచిన పంజాబ్ సారథి శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) బౌలింగ్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌తో రియాన్ పరాగ్ నుంచి కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన సంజూ శాంసన్ జట్టును విజయపథంలో నడిపేందుకు సిద్ధమయ్యాడు.
పంజాబ్ తుది జట్టు : ప్రభ్‌సిమ్రన్ సింగ్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, నేహల్ వధేరా, గ్లెన్ మ్యాక్స్‌వెల్, సుశాంత్ సింగ్, సుర్యాన్ష్ షెడ్గే, మార్కో యాన్సెస్, అర్ష్‌దీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్, చాహల్.
రాజస్థాన్ తుది జట్టు : యశస్వీ జైస్వాల్, సంజూ శాంసన్(కెప్టెన్), నితీశ్ రానా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), షిమ్రన్ హెట్‌మైర్, వనిందు హసరంగ, జోఫ్రా ఆర్చర్, మహీశ థీక్షణ, యుధ్వీర్ సింగ్, సందీప్ శర్మ.