BCCI : భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి త్వరలోనే కొత్త బాస్ రానున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు రోజర్ బిన్ని (Roger Binny) ఉండగా ఇంకొకరి అవసరం ఏంటీ? అని అనుకుంటున్నారా?.. అందుకు కారణం ఉంది. అదేంటంటే బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడితో పాటు ఇతర సభ్యుల వయసు 70 ఏళ్లకు మించకూడదు. అయితే.. బిన్ని మూడు రోజుల (జూలై 19న) క్రితమే ఏడు పదుల వసంతంలో అడుగుపెట్టాడు. రూల్ ప్రకారం ఆయనను తప్పించి.. మరొకరిని ఎన్నుకుంటారా? అనేది తెలియాల్సి ఉంది.
సెప్టెంబర్‌లో వార్షిక సమావేశంజరిగేంత వరకూ బిన్నియే అధ్యక్షుడిగా వ్యవహరించనున్నాడు. అయితే.. ఆలోపు అతడి అధికారిక పత్రాలపై సంతకాలు చేయకూడదని నియమావళి చెబుతోంది. ఈ నేపథ్యంలోనే ఉపాధ్యక్షుడిగా ఉన్న రాజీవ్ శుక్లా (Rajeev Shukla) తదపరి బాస్‌గా నియమితులయ్యే అవకాశముందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై స్పందించేందుకు బిన్ని నిరాకరించాడు. ఈమధ్యే లార్డ్స్ టెస్టు వీక్షించిన ఆయన తర్వాత బెంగళూరు వచ్చాడు. అనంతరం తన 70వ బర్త్ డే వేడుకల కోసం థాయ్‌లాండ్ పర్యటనకు వెళ్లాడు.
Here’s wishing BCCI President and former #TeamIndia all-rounder & the highest wicket-taker in India’s title-winning 1983 World Cup campaign, Roger Binny – a very Happy Birthday 🎂👏 pic.twitter.com/xsc2SY45Lk
— BCCI (@BCCI) July 19, 2025
బీసీసీఐ నిబంధనలు సభ్యుల వయోపరిమితిని 70 ఏళ్లకు మించకూడదని చెబుతున్నాయి. కానీ, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న స్పోర్ట్స్ బిల్ ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉండనుంది. ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల సమావేశంలోనే ఈ బిల్‌ను మంత్రి మాండవీయ మన్సూఖ్ లోక్ సభలో ప్రవేశ పెట్టనున్నారు. ఇప్పటివరకూ స్వతంత్ర సంస్థగా ఉన్న బీసీసీఐ ఈ చట్టం పరిధిలోకే రానుంది.ఈ కొత్త చట్టం రూపుదాలిస్తే.. బీసీసీఐ సభ్యుల వయోపరిమితి 75 ఏళ్లుగా ఉండనుంది. అదే జరిగితే తదపరి బీసీసీఐ సభ్యులు అదనంగా మరో ఐదేళ్లు పదవిలో కొనసాగనున్నారు.