Team India : అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో కీలక మ్యాచ్‌కు ముందే భారత జట్టు(Team India)కు వరుస షాక్‌లు తలుగుతున్నాయి. ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లు ఒక్కొక్కరుగా గాయాల బారిన పడుతున్నారు. అనుకున్నట్టుగానే సిరీస్ విజేతను నిర్ణయించే ఓల్ట్ ట్రఫోర్డ్ టెస్టుకు పేసర్ ఆకాశ్ దీప్(Akash Deep) దూరమయ్యాడు. గజ్జల్లో గాయం(Groin Injury)తో ఇబ్బంది పడుతున్న ఆకాశ్ నాలుగో టెస్టుకు అందుబాటులో ఉండడని మేనేజ్మెంట్ తెలిపింది. దాంతో సిరాజ్ (Siraj)తో కలిసి కొత్త బంతిని పంచుకునేది ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది.
ఇంగ్లండ్ పర్యటనలో సిరీస్ విజయంతో చరిత్ర సృష్టించాలనుకున్న భారత జట్టు లార్డ్స్‌లో అనూహ్య ఓటమితో సిరీస్‌లో వెనకబడింది. ఈ మ్యాచ్ పోయినా ఓల్ట్ ట్రఫోర్డ్‌లో పంజా విసిరి సిరీస్ సమం చేయాలనుకున్న గిల్ సేనకు జట్టు కూర్పు సమస్య తలెత్తింది. ఎవరిని ఆడించాలి? పేస్ దళంలో ఎవరికి చోటివ్వాలి? అనేది సవాల్‌గా మారింది. బర్మింగ్హమ్లో సంచలన స్పెల్(9 వికెట్ల)తో ఇంగ్లండ్ నడ్డివిరిచిన ఆకాశ్ గాయంతో ఆ మ్యాచ్‌లో బౌలింగ్ చేయలేదు. అతడి స్థానంలో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్‌ను ఆడిద్దామనుకుంటే అతడూ నెట్స్‌లో గాయపడ్డాడు.
JUST IN: Akash Deep will miss the fourth #ENGvIND Test at Old Trafford pic.twitter.com/gOXhaQqUCA
— ESPNcricinfo (@ESPNcricinfo) July 22, 2025
స్క్వాడ్‌లోని ఇతరులపై ఆధారపడాలుకుంటే ఆ అవకాశం కూడా లేకపోయింది. పేస్ ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి (Nitish Reddy) సైతం మోకాలి గాయంతో స్వదేశం రానున్నాడు. ఈ నేపథ్యంలో ప్రధాన అస్త్రం జస్ప్రీత్ బుమ్రాను తప్పక ఆడించాల్సిన పరిస్థితి. ఆకాశ్ అందుబాటులో లేకపోవడంతో సిరాజ్, బుమ్రాతో పాటు మూడో పేసర్‌గా ప్రసిధ్‌ను తీసుకోవాల్సి రావచ్చు. తొలి మ్యాచుల్లో విఫలమైన శార్దూల్ ఠాకూర్ కూడా నితీశ్ బదులు తుది జట్టులో ఉండే వీలుంది.
లార్డ్స్‌లో విజయంతో జోరు మీదున్న ప్రత్యర్థిని నిలువరించాలంటే సమిష్టిగా రాణించాల్సిందే. ఎందుకంటే ఓల్డ్ ట్రఫోర్డ్‌లో గత తొమ్మిది మ్యాచుల్లో ఒక్క విజయాన్ని రుచిచూడలేదు. టీమిండియా.. నాలుగింట ఇంగ్లండ్ గెలుపొందగా.. మరో ఐదు మ్యాచులు డ్రాగా ముగిశాయి. అయితే.. బర్మింగ్హమ్లో విక్టరీతో నవ చరిత్ర లిఖించిన గిల్ బృందం.. మరోసారి చెలరేగితే స్టోక్స్ టీమ్‌కు కష్టాలు తప్పవు. ఇరుజట్ల మధ్య బుధవారం (జూలై 23న) నాలుగో టెస్టు మొదలవ్వనుంది.