INDW vs ENGW : ఇంగ్లండ్ పర్యటనలో తొలిసారి టీ20 సిరీస్ కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు వన్డే సిరీస్‌పైనా కన్నేసింది. రెండో మ్యాచ్‌లో గెలుపొందిన ఆతిథ్య జట్టు కూడా సిరీస్ చేజాకుండా చూసుకోవాలనే కసితో ఉంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య నిర్ణయాత్మక మూడో వన్డేలో తలపడుతున్నాయి. టాస్ గెలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ బ్యాటింగ్ తీసుకుంది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ అరుంధతి రెడ్డిని పక్కన పెట్టేసి.. క్రాంతి గౌడ్‌కు చోటు కల్పించారు.
భారత తుది జట్టు : స్మృతి మంధాన, ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, రీచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, రాధా యాదవ్, స్నేహ్ రానా, శ్రీ చరణి, క్రాంతి గౌడ్.
ఇంగ్లండ్ తుది జట్టు : టమ్మీ బ్యూమంట్, అమీ జోన్స్(వికెట్ కీపర్), ఎమ్మా లాంబ్, నాట్ సీవర్ బ్రంట్(కెప్టెన్), సోఫియా డంక్లే, అలిసే డేవిడ్సన్ రిచర్డ్స్, చార్లొల్టె డీన్, సోఫీ ఎకిల్‌స్టోన్, లిన్సే స్మిత్, లారెన్ ఫిలర్, లారెన్ బెల్.
It’s all on the line in Chester-le-Street: India or England? 👀
LIVE 👉 https://t.co/sB6VpTJ3im #ENGvIND pic.twitter.com/D78IGpYJ2g
— ESPNcricinfo (@ESPNcricinfo) July 22, 2025
మూడు వన్డేల సిరీస్‌లో భారత్, ఇంగ్లండ్ చెరొక మ్యాచ్ గెలవడంతో.. ప్రస్తుతం 1-1తో ఉన్నాయి. తొలి వన్డేలో దీప్తి శర్మ (62 నాటౌట్) అర్ధ శతకంతో విరుచుకుపడగా జెమీమా ఖతర్నాక్ ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయంలో కీలక పాత్ర పోషించింది. లార్డ్స్‌లో వర్షం అంతరాయం కారణంగా 29 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు విఫలమయ్యారు. ఓపెనర్ స్మృతి మంధాన(42), దీప్తి శర్మ(30)లు రాణించడంతో 148 రన్స్ చేసింది హర్మన్‌ప్రీత్ సేన. స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లండ్ ధాటిగా ఆరంభించింది. అయితే.. మరోసారి వర్షం అంతరాయం కలిగించగా.. ఆతిథ్య జట్టు లక్ష్యాన్ని కుదించారు. సో… ఇంగ్లండ్ గెలుపొంది సిరీస్ సమం చేసింది.