Errabelli Dayakar Rao | సీఎం రేవంత్ రెడ్డి హామీలిచ్చి ప్రజలను మోసం చేశారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను నమ్మి ప్రజలు మోసపోయారని విమర్శించారు. పాలకుర్తి నియోజకవర్గంలోని రాయపర్తి మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు దిశగా ఎంపీటీసీల క్లస్టర్ల వారీగా సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఎర్రబెల్లి దయాకర్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. కనీసం సాగునీరు కూడా అందించడం లేదని.. వారం రోజుల్లో సాగునీరు ఇవ్వకపోతే పాదయాత్ర చేసి సీఎం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. పెద్ద బ్లాక్‌మెయిలర్ చేతిలో ప్రభుత్వం నడవడం చాలా బాధాకరమని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అరిగోసలు పడుతున్నారని తెలిపారు.