Bhuvaneshwar Kumar : పొట్టి క్రికెట్లో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ (Bhuvaneshwar Kumar) అరుదైన ఫీట్ సాధించాడు. అత్యధిక టీ20 మ్యాచ్‌లు ఆడిన తొలి భారత బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్‌తో కలిపి ఈ వెటరన్ పేసర్ 300 టీ20లు ఆడాడు. తద్వారా టీమిండియా స్టార్ పేసర్లు, ఆల్‌రౌండర్లు అందరినీ దాటేసి ఈ మైలురాయికి చేరాడీ పేస్ గన్.
18వ ఎడిషన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్న భువీ.. ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ సందర్భంగా ఈ ఘనతకు చేరువయ్యాడు. హార్దిక్ పాండ్యా రెండో స్థానంలో కొనసాగుతుండగా.. పేసర్ జస్ప్రీత్ బుమ్రా 234 మ్యాచులతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకూ 204 మ్యాచ్‌లు ఆడిన హర్షల్ పటేల్ నాలుగో స్థానంలో నిలిచాడు. 201 మ్యాచ్‌లు ఆడిన పేసర్ సందీప్ శర్మ ఐదో ప్లేస్ దక్కించుకున్నాడు.
Bhuvneshwar Kumar is featuring in his 300th T20 match during RCB’s clash against RR.
The speedster has played for India, India A, Uttar Pradesh, Pune Warriors India, Royal Challengers Bengaluru, and Sunrisers Hyderabad. pic.twitter.com/seDB59U0s1
— Cricket.com (@weRcricket) April 13, 2025
స్వింగ్‌తో అదరగొట్టే భువనేశ్వర్ మూడు ఫార్మాట్లలో జాతీయ జట్టుకు ఆడాడు. అయితే.. 2022లో అతడు చివరిసారిగా భారత జెర్సీ ధరించాడు. దేశం తరఫున 87 టీ20లు ఆడిన భువీ.. ఐపీఎల్లో కీలక పేసర్‌గా రాణిస్తున్నాడు. 2009లో ఆర్సీబీ ప్లేయర్‌గా ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఈ స్పీడ్‌స్టర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు విశేష సేవలందించాడు. పవర్ ప్లేలో వికెట్ పడగొట్టే ఇతడు.. ఇప్పటివరకూ 300 టీ20ల్లో 315 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ స్పెషలిస్ట్ బౌలర్‌గా పేరొందిన భువనేశ్వర్‌ను 2025 మెగా వేలంలో రూ.10.75 కోట్లకు కొన్నది ఆర్సీబీ. ఈ సారి 6 వికెట్లు తీసిన పేసర్.. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇదివరకే టీ20ల్లో 300 వికెట్లు తీసిన తొలి పేసర్‌గానూ భువనేశ్వర్ రికార్డు సాధించిన విషయం తెలిసిందే.