Actress | ఇటీవలి కాలంలో ముద్దుగుమ్మలు అందంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో సర్జరీలు కూడా చేయించుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం. కొందరికి సర్జరీ కలిసొచ్చిన మరి కొందరికి వికటించి ఫేస్ షేప్ మారిపోతూ ఉంటుంది. తాజాగా బాలీవుడ్ నటి మౌనీ రాయ్ మరింత అందంగా కనిపించేందుకు ముఖానికి సర్జరీ చేయించుకున్నట్టు బీ టౌన్లో తెగ ప్రచారం నడుస్తుంది. అయితే ఇటీవల ఫేస్ సర్జరీలు చేయించుకున్న నటీమణులపై ట్రోలింగ్ జరుగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే మౌనీ రాయ్‌ను లక్ష్యంగా చేసుకుని ట్రోల్స్ చేస్తున్నారు.
మౌనీ రాయ్ తదుపరి చిత్రం “ది భూత్నీ” సినిమా ఈవెంట్లో పాల్గొన్నప్పటి నుండి ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందం కోసం ఈమె సర్జరీ చేయిచుకుందని, ముఖ కవళికలు కూడా పూర్తిగా మారిపోయాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నెట్టింట తనపై సాగుతున్న ప్రచారంపై మౌనీ రాయ్ స్పందించారు. నాపై కామెంట్స్ చేసేవాళ్లు నాకు కనిపించరు. కాబట్టి వాళ్ల మాటలకు నేను బాధపడాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. వారి మాటలని నేను పెద్దగా పట్టించుకోను కూడా. వేరే వాళ్లని ట్రోల్స్ చేస్తూ ఆనందం పొందాలని అనుకున్నవాళ్లని మనం ఏం చేయలేము. ఎవరికి నచ్చినట్టు వారిని జీవించనివ్వండి అంటూ వేదాంత ధోరణితో మాట్లాడింది మౌనీరాయ్.
ఇక సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన మౌనీ రాయ్… “నాగిని” సీరియల్‌తో అన్ని భాషల్లో అభిమానులను సొంతం చేసుకున్నారు. అక్షయ్ కుమార్ నటించిన “గోల్డ్” చిత్రంతో వెండితెరకు పరిచయమై ఈ చిత్రంతో ఎంతగానో అలరించింది.ఇక బ్రహ్మాస్త్ర చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. ఈ చిత్రంలో మౌనీ రాయ్ నటనకి మంచి మార్కులు కూడా పడ్డాయి. ప్రస్తుతం ఈ అమ్మడు “ది భూత్నీ”లో నటిస్తున్నారు. సంజయ్ దత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ హారర్ మూవీ ఏప్రిల్ 18న విడుదలకానుంది. ఈ సినిమాపై మౌనీ రాయ్ ఎన్నో అంచనాలు పెట్టుకుంది.