బుధవారం 23 సెప్టెంబర్ 2020
Sports - Jul 27, 2020 , 18:33:02

రూట్​, స్టోక్స్​కు విశ్రాంతి.. డెన్లీకి చోటు

రూట్​, స్టోక్స్​కు విశ్రాంతి.. డెన్లీకి చోటు

మాంచెస్టర్​: ఈ నెల 30 నుంచి ఐర్లాండ్​తో జరిగే మూడు వన్డేల సిరీస్ కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) జట్టును ప్రకటించింది. వెస్టిండీస్​తో జరుగుతున్న రెండో టెస్టులో ఉద్వాసనకు గురైన బ్యాట్స్​మన్​ జో డెన్లీ ఈ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఇయాన్ మోర్గాన్ ఇంగ్లండ్​ జట్టుకు సారథ్యం వహించనుండగా.. మళ్లీ జట్టులోకి వచ్చిన ఆల్ రౌండర్ మొయిన్ అలీ వైస్ కెప్టెన్​ బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా టెస్టు కెప్టెన్ జో రూట్​, స్టార్ ఆల్​రౌండర్ బెన్​ స్టోక్స్​కు ఇంగ్లండ్ విశ్రాంతినిచ్చింది.

సౌతాంప్టన్​ వేదికగా ఇంగ్లండ్, ఐర్లాండ్ మధ్య 30వ తేదీన తొలి వన్డే జరుగనుంది. బయో సెక్యూర్ వాతావరణంలో ప్రేక్షకులు లేకుండానే మూడు వన్డేలు జరుగనున్నాయి. 2023 ప్రపంచకప్ కోసం అర్హత కోసం ఐసీసీ ప్రవేశ పెట్టిన సూపర్​ లీగ్​ ఈ సిరీస్​తోనే ప్రారంభం కానుంది.

ఐర్లాండ్​తో వన్డే సిరీస్​కు ఇంగ్లండ్ జట్టు: ఇయాన్ మోర్గాన్(కెప్టెన్​), మొయిన్ అలీ, జానీ బెయిర్​ స్టో, టామ్ బాంటన్​, సామ్ బిల్లింగ్స్​, టామ్ కరన్​, లియమ్ డాసన్​, డో జెన్లీ, షకీబ్ మహమూద్​, అదిల్ రషీద్​, జేసన్ రాయ్​, రీస్ టోప్లీ, జేమ్స్ విన్స్​, డేవిడ్ విల్లీ 


logo