మానవత్వం చాటిన మహబూబాబాద్ పోలీసులు

మహబూబాబాద్ : జిల్లా పోలీసులు మానవత్వం చాటారు. అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహించి తమ సహృదయతను చాటుకున్నారు. ఖాకీలు అంటే కర్కశత్వమే అనే నానుడి నిజం కాదని తమకు మనసు ఉంటుందని చేతల్లో చూపారు.
వివరాల్లోకి వెళ్తే..జిల్లా కేంద్రంలోని టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఒక అనాథ మహిళ (40) మూడు రోజుల క్రితం చనిపోయింది. అయితే పోలీసులు అనాథ మృతదేహాన్ని జిల్లా దవాఖానలోని మార్చురీకి తరలించారు. మూడు రోజులుగా ఆమె కోసం ఎవరైనా వస్తారు అని వేచి చూశారు.
ఎవరూ రాకపోవడంతో మృతదేహానికి మహబూబాబాద్ టౌన్ పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు. గుర్తు తెలియని (40) సంవత్సరాల మహిళ మూడు రోజుల క్రితం వడదెబ్బతో టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన పడి ఉంది. దీంతో పోలీసులు జిల్లా దవాఖానకు తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందిందని చెప్పారు.
అనంతరం మృతదేహాన్ని జిల్లా దవాఖానలోని మార్చరీకి తరలించారు. ఎవరైనా వస్తారేమోనని పోలీసులు ఎదురు చూశారు. ఎవరూ రాకపోవడంతో సోమవారం ఉదయం ఆరున్నర గంటల సీఐ వెంకటరత్నం. ఎస్సై సంతోష్ కుమార్.
కానిస్టేబుల్ మోహన్ రాజులతో కలిసి నిజాం చెరువు శివారులో పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు అంత్యక్రియలు నిర్వహించడం తో మహబూబాబాద్ పట్టణంలో అంత చర్చనీయాంశంగా మారింది.
అనాథ మహిళ పట్ల టౌన్ పోలీసులు చేసిన సేవలను ప్రశంసిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఇల్లంతకుంటలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

