e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home News ఇల్లంత‌కుంట‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ఇల్లంత‌కుంట‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ఇల్లంత‌కుంట‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

రాజ‌న్న సిరిసిల్ల : ఐటీ, మున్సిపల్‌ శాఖల మంత్రి కేటీఆర్‌ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాలకిష‌న్‌, న్యాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావుతో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు. మ‌రికాసేప‌ట్లో వివేకానంద విగ్రహం దగ్గర సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టం, బస్టాండ్‌ వద్ద మహిళా సంఘ భవనం, తాసిల్‌ నూతన కార్యాలయ భవనం, రైతువేదిక, కూరగాయల అంగడిని ప్రారంభిస్తారు. అనంతరం అక్కడే నిర్వహించే బహిరంగ సభలో మంత్రి కేటీఆర్‌ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్‌కు తిరుగుపయనమవుతారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఇల్లంత‌కుంట‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ట్రెండింగ్‌

Advertisement