Asia Cup trophy | ఆసియా కప్ ఫైనల్లో ఓ నాటకీయ పరిణామం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఫైనల్లో పాక్‌పై భారత్ ఘన విజయం సాధించగా.. ట్రోఫీ (Asia Cup trophy)ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ (PCB chief) మోసిన్ నఖ్వి (Mohsin Naqvi) చేతుల మీదుగా తీసుకోవడానికి నిరాకరించింది (India refuse Asia Cup trophy). దీంతో ఆసియా కప్, పతకాలతో నఖ్వీ అక్కడి నుంచి వెళ్లిపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నఖ్వీ తీరుపై బీసీసీఐ (BCCI) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ విషయంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా (Devajit Saikia) స్పందిస్తూ.. మన దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్న వ్యక్తి నుంచి భారత జట్టు ట్రోఫీని స్వీకరించలేదని తెలిపారు. అంతమాత్రాన ఆయన ట్రోఫీని, పతకాలను తన హోటల్‌కు ఎలా తీసుకెళ్తారు..? అంటూ ప్రశ్నించారు. ఇది ఊహించని పరిణామం అని పేర్కొన్నారు. దీనిపై నవంబర్ మొదటి వారంలో దుబాయ్ వేదికగా జరిగే ఐసీసీ సమావేశంలో ఈ విషయంపై గట్టిగా నిరసన తెలుపుతామని ఆయన వెల్లడించారు. నఖ్వీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు పాక్ అంతర్గత మంత్రి కూడా. దీంతో ఆయన తీరు ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.
పహల్గాం ఉగ్రదాడితో ఇరు దేశాల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆసియా కప్ టీ20 టోర్నీలో విజేతగా నిలిచిన టీమ్ఇండియా.. ట్రోఫీ (Asia Cup trophy)ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ (PCB chief) మోసిన్ నఖ్వి (Mohsin Naqvi) చేతుల మీదుగా తీసుకోవడానికి నిరాకరించింది (India refuse Asia Cup trophy). ఖాళీ చేతులతోనే విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది. ఫొటోలకు ఫోజులిచ్చిన అనంతరం టీమ్ఇండియా జట్టు అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన దృష్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
Also Read..
Asia Cup trophy | ట్రోఫీ తీసుకోకుండా.. ఖాళీ చేతులతోనే టీమ్ ఇండియా సెలబ్రేషన్స్.. VIDEO
BCCI | ఆసియా కప్ విజేత భారత్‌కు బీసీసీఐ భారీ నజరానా.. ఎన్ని కోట్లంటే..?