BCCI | ఆసియా కప్ (Asia Cup) ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను భారత్ (Team India) చిత్తుచేసింది. సమిష్టి ప్రదర్శనతో కదంతొక్కుతూ పాక్‌ను ఓడించిన టీమ్ఇండియా…రికార్డు స్థాయిలో తొమ్మిదో సారి ఆసియాకప్‌ను సగర్వంగా ముద్దాడింది. దీంతో టీమ్ఇండియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. జట్టు విజయంపై భారత క్రికెట్ బోర్డు (BCCI) కూడా తన సంతోషాన్ని పంచుకుంది. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేసింది. ఆసియా కప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టుకు భారీ నజరానా ప్రకటించింది. రూ.21 కోట్ల ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఈ మొత్తాన్ని ఆటగాళ్లతోపాటూ సహాయ సిబ్బందికి కూడా అందించనున్నట్లు తెలిపింది.
3 blows.
0 response.
Asia Cup Champions.
Message delivered. 🇮🇳21 crores prize money for the team and support staff. #AsiaCup2025 #INDvPAK #TeamIndia pic.twitter.com/y4LzMv15ZC
— BCCI (@BCCI) September 28, 2025
ఆసియా కప్ టీ20 టోర్నీలో విజేతగా నిలిచిన టీమ్ఇండియా.. ట్రోఫీ (Asia Cup trophy)ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ (PCB chief) మోసిన్ నఖ్వి (Mohsin Naqvi) చేతుల మీదుగా తీసుకోవడానికి నిరాకరించింది (India refuse Asia Cup trophy). ఖాళీ చేతులతోనే విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది. ఫొటోలకు ఫోజులిచ్చిన అనంతరం టీమ్ఇండియా జట్టు అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన దృష్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
ఆసియాకప్‌లో భారత్ విజయదుందుభి మోగించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను పాతరేస్తూ ఫైనల్లో అదరగొట్టింది. టోర్నీలో ముచ్చటగా మూడోసారి దాయాదిని మట్టికరిపించిన టీమ్ ఇండియా దుబాయ్ నడిగడ్డపై మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించింది. పహల్గాం ఉగ్రదాడితో ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితిలో భారత్ తమ సత్తాఏంటో చేతల్లో చూపెట్టింది. సమిష్టి ప్రదర్శనతో కదంతొక్కుతూ పాక్‌ను ఓడించిన టీమ్ఇండియా…రికార్డు స్థాయిలో తొమ్మిదో సారి ఆసియాకప్‌ను సగర్వంగా ముద్దాడింది. టోర్నీలో అపజయమన్నదే లేకుండా సాగిన టీమ్ఇండియా.. ఆదివారం చిరకాల ప్రత్యరితో ఆద్యంతం ఉత్కంఠగా జరిగిన ఆసియా కప్ (Asia Cup) ఫైనల్లో ఆ జట్టును 5 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. పాక్ నిర్దేశించిన 147 పరుగుల ఛేదనను భారత్ 19.3 ఓవర్లలో పూర్తిచేసింది.
Also Read..
Asia Cup trophy | ట్రోఫీ తీసుకోకుండా.. ఖాళీ చేతులతోనే టీమ్ ఇండియా సెలబ్రేషన్స్.. VIDEO
PM Modi | యుద్ధ భూమిలోనూ.. మైదానంలో ఫలితం ఒక్కటే: ప్రధాని మోదీ
ఆపరేషన్ తిలక్.. ఫైనల్లో పాక్‌పై భారత్ ఉత్కంఠ విజయం