న్యూఢిల్లీ: దాయాది పాకిస్థాన్‌ను మట్టికరిపించి ఆసియా కప్‌ను (Aisa Cup)లో టైటిల్‌ను సొంతం చేసుకున్న టీమ్ ఇండియాను (Team India) ప్రధాని మోదీ (PM Modi) అభినందించారు. యుద్ధ భూమిలోనూ, మైదానంలో ఫలితం ఒక్కటే అని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ‘మైదానంలోనూ ‘ఆపరేషన్ సిందూర్’. ఎక్కడైనా ఫలితం ఒక్కటే. ఇండియా గెలిచింది. భారత క్రికెటర్లకు అభినందనలు’ అంటూ ట్వీట్ చేశారు.
ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్లో భారత్ మరో రెండు బంతులు ఉండగానే 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తిలక్ వర్మ సాధికారిక బ్యాటింగ్‌తో భారత్ తన ఖాతాలో తొమ్మిదో ఆసియా కప్‌ను తన ఖాతాలో వేసుకుది. 41 ఏండ్ల ఆసియా కప్ టోర్నీ చరిత్రలోనే తొలిసారి ఫైనల్లో తలపడ్డ ఇరుజట్లలో టీమ్ఇండియా పూర్తిస్థాయిలో ఆదిపత్యం చలాయించింది. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత దయాది జట్లు తొలిసారి తపడ్డాయి. టోర్నమెంట్లో మూడు సార్లు ఎదురుపడిన పాక్‌ను భారత్ చిత్తుచిత్తుగా ఓడించింది. పాక్ మంత్రి, ఏసీసీ చీఫ్‌గా వ్యవహరిస్తున్న మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడానికి ఇష్టపడని టీమ్ ఇండియా.. ట్రోఫీ లేకుండా సంబురాలు చేసుకుంది. చిరకాల ప్రత్యర్థిపై విజయం సాధించడంతో సామాన్యుని నుంచి ప్రధాని వరకు భారత క్రికెటర్లపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
#OperationSindoor on the games field.
Outcome is the same – India wins!
Congrats to our cricketers.
— Narendra Modi (@narendramodi) September 28, 2025