BCCI : ఐపీఎల్లో ఛాంపియన్‌గా అవతరించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయోత్సవ యాత్ర విషాదాంతమైంది. తమ అభిమాన క్రికెటర్లను చూసేందుకు ఫ్యాన్స్ భారీగా చిన్నస్వామి స్టేడియానికి తరలిరాగా తొక్కిసలాట (Stampede) చోటుచేసుకుంది. ఈ ఘటనలో 10 మంది మరణించడంపై బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా (Devajit Saikia) విచారం వ్యక్తం చేశాడు. అభిమానులు చనిపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించిన సైకియా.. విజయోత్సవ యాత్రను పక్కాగా నిర్వహించాల్సిందని అభిప్రాయపడ్డాడు.
‘చిన్నస్వామి స్టేడియం సమీపంలో జరిగిన తొక్కిసలాట బాధాకరం. ఈ ఘటనలో 11 మంది అభిమానులు మరణిచడం చాలా దురదృష్టకరం. ఇది ఒకరమైన ప్రతికూలమైన పావులారిటీ. ఫ్యాన్స్ తమ అభిమాన క్రికెటర్లను పిచ్చిగా ఆరాధిస్తారు. అందుకే.. ఇలాంటి విక్టరీ పరేడ్లు జరిపే సమయంలో నిర్వాహకలు చాలా అప్రమత్తంగా, ప్రణాళికాబద్ధంగా ఉండాలి. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారు వేగంగా కోలుకోవాలని భగవంతుడిని కోరుకుంటున్నా’ అని సైకియా తెలిపాడు.
#BREAKING: 🚨 Stampede at Bengaluru’s Chinnaswamy Stadium during #RCB victory celebration — 11 dead, 50+ injured including a child.
Crowd control under scanner.
Reports @Nihal_kmr @RCBTweets @BlrCityPolice @CMofKarnataka #Stampede #IPL2025 #Breaking #chinnaswamystadium… pic.twitter.com/bVFJVPgps8
— The New Indian (@TheNewIndian_in) June 4, 2025
అంతేకాదు విక్టరీ పరేడ్‌ను నిర్వహించడంలో కర్నాటక ప్రభుత్వం విఫలమైందన ఆయన తీవ్రంగా మండిపడ్డాడు. భారత జట్టు టీ20 వరల్డ్ కప్ గెలుపొందిన తర్వాత విక్టరీ పరేడ్‌కు అభిమానులు పోటెత్తారని, కానీ ముంబై క్రికెట్ అసోసియేషన్ పక్కా ప్రణాళికతో విజయవంతంగా పరేడ్‌ను నిర్వహించిందనే విషయాన్ని ఈ సందర్భంగా సైక్రటరీ గుర్తు చేశాడు.
‘భారత జట్టు టీ20 వరల్డ్ కప్ ట్రోఫీతో బార్బడోస్ నుంచి వచ్చాక విక్టరీ పరేడ్ నిర్వహించారు. అప్పుడు ముంబైలోని అరేబియన్ సముద్రం రోడ్డులో జరిగిన విజయోత్సవ ర్యాలీకి భారీగా అభిమానులు తరలివచ్చారు. కానీ, ఎవరికీ ఏ చిన్నపాటి హాని కూడా జరగలేదు. నిరుడు కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) కప్ గెలిచిన తర్వాత కూడా విక్టరీ పరేడ్ జరిపారు. అప్పుడూ ఎవరూ గాయపడలేదు. అహ్మదాబాద్‌లో మంగళవారం ఐపీఎల్ ఫైనల్‌ను దాదాపు లక్షా 20 వేల మంది వీక్షించారు. అయినా సరే.. అందరూ సురక్షితంగా తమ ఇళ్లకు చేరుకున్నారు. అందుకే.. విజయోత్సవ యాత్రలు నిర్వహించేముందు అభిమానుల భద్రతను దృష్టిలో పెట్టుకోవాలి’ అని సైకియా వెల్లడించాడు.
‘Relief, happiness, gratefulness’
‘A feeling I cannot describe’
‘Loyalty comes with a trophy’ 🏆They delivered on the promise, now they celebrate 🤩
🎥 🗣 Hear from the 𝙝𝙞𝙨𝙩𝙤𝙧𝙮-𝙢𝙖𝙠𝙚𝙧𝙨 themselves ❤#TATAIPL | #RCBvPBKS | #Final | #TheLastMile | @RCBTweets
— IndianPremierLeague (@IPL) June 4, 2025