ములుగురూరల్ : కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం ప్రవేశపెట్టిన పథకాలను అధికారులు ప్రజలకు చేరువ చేయాలని కేంద్ర ఐ అండ్ బి జాయింట్ సెక్రటరీ ప్రీతుల్ కుమార్ అన్నారు. జిల్లాలో రెండు రోజుల పర్యటన సందర్భంగా ఆయన బుధవారం ములుగు కలెక్టరేట్ చేరుకొని అధికారులతో పథకాలపై సమీక్ష నిర్వహించారు. ప్రథమ మంత్రి కృషి యోజన, జల్ జీవన్ మిషన్ పథకాలను జిల్లాలో అమలు చేయాలని సూచించారు.
నీటి పారుదల శాఖకు చెందిన పాలెంవాడు ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. కమ్యూనిటీ మరుగుదొడ్లు, విభజన షెడ్లు, స్వచ్చభారత్ పథకం, ఆయిల్ ఫామ్ మొక్కల పెంపకం, మిర్చి ప్రాసెసింగ్ యూనిట్లు, జిల్లాలో అమలు అవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలపై జిల్లా కలెక్టర్ జాయింట్ సెక్రటరీకి వివరించారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ సంపత్రావు, అర్డబ్ల్యూ ఎస్ఈ మల్లేశం, డీఏఓ సురేశ్ కుమార్, డీహెచ్ఎస్ఓ సంజీవరావు, ఇతర అధికారులు ఉన్నారు.