Upasana | ఉపాసన కామినేని తల్లి శోభన కామినేని అప్పుడప్పుడు తన ఫిట్నెస్తో వార్తలలో నిలుస్తూ ఉంటారు. శోభన కామినేని అపోలో ఆస్పత్రుల ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్‌పర్సన్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు ఎకనామిక్స్‌లో బాచిలర్ డిగ్రీ, కోలంబియా యూనివర్సిటీలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీలు ఉన్నాయి. అదేవిధంగా, ఆమె జాతీయ స్థాయి స్క్వాష్ క్రీడాకారిణిగా, సైక్లింగ్, అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో ఆసక్తి చూపించారు . శోభన తాజాగా తన ఇంటి నుంచి చెన్నైలోని బిషప్ గార్డెన్స్ వరకు సైకిల్‌పై ప్రయాణించారు. అంటే 60 ఏళ్ల వయస్సులో దాదాపు 600కి పైగా కిమీ ప్రయాణించారు.
మోకాలికి ఆపరేషన్ అయినప్పటికీ, నెక్లో ప్లేట్స్‌ను ఉంచి ఆపరేషన్ చేసినప్పటికీ, ఇంకా చాలా గాయాలు ఉన్నప్పటికీ తన తల్లి అంత దూరం సైక్లింగ్ చేయడం నాకు గర్వకారణం అని చెప్పుకొచ్చింది ఉపాసన. ఆమె ఇది ఎవరికో మెసేజ్ ఇవ్వడం లేదా, ఏదైనా సేవా కార్యక్రమం కోసం కాకుండా, తనను తాను ఛాలెంజ్ చేసుకుని ఈ అరుదైన ఫీట్‌ను సాధించిందని ఉపాసన తెలియజేసింది. ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ద ఉన్న వారు, ఆరోగ్యం సరిగ్గా ఉన్న వారు మాత్రమే ఈ సాహసం చేయగలరు అంటూ నెటిజన్స్ ఈ కామెంట్స్ చేస్తున్నారు. ఆరు రోజుల్లో 642 కిలోమీటర్లు పూర్తి చేయడం ద్వారా ఆమె రోజుకు సగటున 107 కిలోమీటర్లు సైక్లింగ్ చేశారు. ఈ ప్రయాణం ద్వారా ఆమె శారీరక, మానసిక దృఢత్వాన్ని ప్రదర్శించారు .
ఉపాసన తన తల్లి శోభన కామినేని సాధించిన ఈ విజయాన్ని ఉపాసన పిన్ని ప్రీత రెడ్డి కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. శోభన కామినేని సైక్లింగ్ ద్వారా శారీరక దృఢత్వం, పట్టుదల, మరియు లక్ష్య సాధనకు మంచి ఉదాహరణగా నిలిచారు. ఆమె ఈ ప్రయాణం ద్వారా మహిళలకు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించారు. ఇక తల్లి మాదిరిగానే కూతురు ఉపాసన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తూ ఉంటుంది.