మక్తల్ : త్వరలో జరగబోయే రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలలో (cycling competition ) జిల్లా క్రీడాకారులు సత్తా చాటాలని నారాయణపేట జిల్లా సైకిల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి.గోపాలం ( Gopalam ) అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జూన్ 3 ప్రపంచ సైక్లింగ్ ( Cycling Day ) దినోత్సవం సందర్భంగా నిర్వహించిన జిల్లా స్థాయి సైక్లింగ్ పోటీలలో గెలుపొందిన వారికి ప్రశంస పత్రాలు, మెడల్స్ ను అందించామని తెలిపారు.
సైక్లింగ్ పోటీలో 150 మంది బాలబాలికలు పాల్గొని 12 సంవత్సరాల లోపు బాలికల విభాగంలో కావాలి సిరి ప్రార్థన ప్రథమ స్థానం, శ్రీ చందన ద్వితీయ స్థానం, సాయి కీర్తన తృతీయ స్థానం లో నిలిచారన్నారు. 14 సంవత్సరాల లోపు జయ పల్లవి, కీర్తి, అంజలి, 18 సంవత్సరాల లోపు వరలక్ష్మి, 19 సంవత్సరాల పైబడిన మహిళల విభాగంలో అనూష విజయం సాధించారని వివరించారు.
బాలుర విభాగంలో 12 సంవత్సరాల లోపు తనుజ్, హిమాన్షు, సాయి హర్షిత్, 14 సంవత్సరాల లోపు అనిరుద్, అజయ్, సాత్విక్ రామ్, వెంకటేష్, రమేష్, ప్రశాంత రాకేష్, 18 సంవత్సరాల లోపు మోహన్, సుశాంత్ యాదవ్ గెలుపొందారని తెలిపారు. ఈనెల 10 నుంచి 11వ తేదీలలో హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే సైక్లింగ్ అకాడమీ రాష్ట్రస్థాయి ఎంపికలో మక్తల్‌కు చెందిన అజయ్, సాత్విక రామ్ ,రమేష్ , వెంకటేష్, ప్రశాంత్ ,రాకేష్ పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో రమేష్ కుమార్, విష్ణువర్ధన్ రెడ్డి, అమ్రేష్, రాఘవేందర్, దామోదర్, కుమారి మీనా, జయమ్మ, క్రీడాకారులు తదితరులు ఉన్నారు.