BCCI : భారత యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ (Shubman Gill) టీ20 సిరీస్‌కు దూరం కానున్నాడు. స్వదేశంలో బంగ్లాదేశ్(Bangladesh)తో జరుగనున్న పొట్టి సిరీస్‌కు గిల్ విశ్రాంతి తీసుకోనున్నాడు. అడడిపై పని భారత తగ్గించాలనే ఉద్దేశంతో బీసీసీఐ (BCCI) ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. టీమిండియా భావి కెప్టెన్‌గా పిలవబడుతున్న గిల్‌కు బ్రేక్ ఇవ్వడానికి కారణం ఉంది. అది ఏంటంటే..?
బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల అనంతరం ఇరుజట్ల మధ్య పొట్టి సిరీస్ జరుగనుంది. అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 12 మధ్య మూడు వేదికల్లో మూడు టీ20 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. అయితే.. అక్టోబర్ 16వ తేదనే న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ మొదలవ్వనుంది. అందువల్ల గిల్‌పై పని ఒత్తిడి లేకుండా చూడాలని బీసీసీఐ భావించింది. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు అతడికి విశ్రాంతి ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చింది.
The newly-appointed T20I vice-captain Shubman Gill is likely to miss the three-T20I series against Bangladesh.
📷:BCCI
#Cricket #indvsban #India #t20cricket #shubmangill pic.twitter.com/G0o30Waw6S
— SportsTiger (@The_SportsTiger) September 15, 2024
‘అవును.. బంగ్లాతో టీ20 సిరీస్‌లకు శుభ్‌మన్ గిల్‌కు విశ్రాంతి ఇస్తున్నాం. ఎందుకంటే తొలి మ్యాచ్ అక్టోబర్ 6న గ్వాలియర్‌లో, రెండో మ్యాచ్ అక్టోబర్ 9న ఢిల్లీలో, ఆఖరి మ్యాచ్ అక్టోబర్ 12వ తేదీన హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరుగనున్నాయి. మూడో టీ 20 ముగిసిన మూడు రోజులకే న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్. అందుకని ప్రయాణ బడలిక వంటి సమస్యలు ఏర్పడకుండా ఉండాలనే గిల్‌కు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించాం’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
టీ20 వరల్డ్ కప్ అనంతరం జింబాబ్వే పర్యటనలో గిల్ టీ20 జట్టుకు సారథిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకూ గిల్ దేశం తరఫున 21 టీ20 ఆడాడు. ఒక సెంచరీ, మూడు అర్ద శతకాలు సాధించాడు.