BCCI : ప్రపంచంలోనే సంపన్న క్రికెట్ బోర్డు అయిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)ప్రతి ఏటా భారీగా సమకూర్చుకుంటోంది. మీడియా, డిజిటల్ హక్కుల వేలంతో పాటు స్పాన్సర్షిప్ ద్వారా కోట్లాది రూపాయలు ఆర్జిస్తోంది. మరీ ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఏమంట మొదలైందో బీసీసీఐ పంట పండిందనే చెప్పాలి. అవును.. నిరుడు ఐపీఎల్ ద్వారానే భారత బోర్డు ఏకంగా రూ.5,761 కోట్లు సముపార్జించింది. మొత్తంగా చూస్తే.. 2023- 24లో రూ.9741.7 కోట్లు బీసీసీఐ ఖాతాలో చేరాయి. బీసీసీఐ సంపాదనలో సింహభాగం ఐపీఎల్ వాటానే ఉండడం విశేషం.
బీసీసీఐకి ఆదాయ వనరులు చాలానే ఉన్నాయి. ఐపీఎల్, మహిళల ప్రీమియర్ లీగ్ ప్రసార హక్కులు, డిజిటల్ రైట్స్ రూపంలో భారీగా డబ్బులు సమకూరుతాయి. ఇక అంతర్జాతీయ క్రికెట్ మండలి నుంచి పెద్ద వాటా ఎలాగూ ఉండనే ఉంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో, బీసీసీఐ సుమారు 1,159 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో, బీసీసీఐ ఆదాయం 20,686 కోట్లకు పెరిగింది, ఇది 2023లో 16,493 కోట్లుగా ఉంది.
BCCI rakes in a record revenue of ₹9741.7 Cr in FY 2023–24 — with IPL alone contributing ₹5761 Cr! 💰🇮🇳🏏
The IPL craze is simply unmatched and unstoppable! 🌎🤯🏆#BCCI #IPL #Cricket #India #Sportskeeda pic.twitter.com/kJ4oCO1M1r
— Sportskeeda (@Sportskeeda) July 18, 2025