మహదేవపూర్(కాళేశ్వరం), జూలై 18 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బరాజ్‌కు ప్రవాహం త గ్గింది. శుక్రవారం 82,330 క్యూసెకుల ప్రవాహం రాగా, మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుత నీటి ప్రవాహం బరాజ్ రివర్ బెడ్ నుంచి సముద్ర మట్టానికి 89.90 మీటర్ల ఎత్తులో ఉందని భారీ నీటిపారుద లశాఖ అధికారులు తెలిపారు. అదేవిధంగా కాళేశ్వరంలో ప్రాణహిత వరద ప్రవాహం తగ్గింది.
ఇవి కూడా చదవండి..