హైదరాబాద్ జూలై 18 (నమస్తేతెలంగాణ): సూర్యాపేట ఎమ్యేల్యే, మాజీ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి (Jagadish Reddy) జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగానే కాదు విదేశాల్లోనూ సంబురంగా జరిగాయి. ఎన్నారై బీఆర్ఎస్ యూకే సెల్ (NRI BRS UK Cell) ఉపాధ్యక్షుడు గొట్టెముక్కుల సతీశ్ రెడ్డి (G.Satish Reddy) ఆధ్వర్యంలో జగదీశ్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలను గురువారం (జూలై 17) రాత్రి ఘనంగా నిర్వహించారు. ఎన్నారై బీఆర్ఎస్ యూకే సెల్ అధ్యక్షుడు నవీన్ రెడ్డి (Naveen Reddy) సమక్షంలో కేక్ కట్ చేసి సభ్యులు పరస్పరం తినిపించుకున్నారు.
ఈ సందర్భంగా ‘లాంగ్లైవ్ జగదీశ్‌రెడ్డి’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ప్రజా సేవలో తరిస్తున్న జగదీశ్ రెడ్డి నిండూనూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని బీఆర్ఎస్ యూకే సెల్ ప్రతినిధులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ యూకే సెల్ రవి కుమార్ రేటినేని, అధికార ప్రతినిధి ప్రదీప్ గౌడ్ పులుసు, సత్య చిలుముల, హరిగౌడ్, రత్నాకర్, సత్యపాల్ రెడ్డి, తరుణ్, అబూజాఫర్, పవన్ కల్యాణ్, అజయ్ రావు పాల్గొన్నారు.
మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి జన్మదినం పురస్కరించుకుని కేక్ కట్ చేస్తున్న బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ యూకే సెల్ నాయకులు