జవహర్‌నగర్, జులై 18: సరైన పత్రాలు లేకుండా వాహనాలు రోడ్లపై తిరిగితే జఫ్తు చేస్తామని వాహనదారులను జవహర్‌నగర్ ఎస్‌హెచ్‌వో సైదయ్య హెచ్చరించారు. జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని యాప్రాల్ ప్రాంతంలో ఎస్‌హెచ్‌వో సైదయ్య ఆధ్వర్యంలో శుక్రవారం సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ నిర్వహించారు.
ఈ సందర్భంగా సైదయ్య మాట్లాడుతూ వాహనాలకు నెంబర్ప్లేట్లను తొలగించి మాదకద్రవ్యాలను సరఫరాల చేస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు. ప్రతి వాహనాన్ని సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలించి, ఆరు వాహనాలకు సీజ్‌చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు వేణుమాధవ్, నర్సిరెడ్డి, మమత, పోలీసులు పాల్గొన్నారు.