మెదక్, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లా దవాఖానలో శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. మెదక్ జిల్లా సర్కార్ దవాఖానలో పనిచేస్తున్న సిబ్బంది లతీఫ్ ముజుద్దీన్ మెడికల్ ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన 1,000కి పైగా బిల్లులు పెండింగ్‌లో ఉంచారని, 100 బిల్లులు మాత్రమే చెల్లించి, పలువురిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని వచ్చిన సమాచారంతో దాడులు చేసి రికార్డులు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. బిల్లులు పెండింగ్‌లో ఎందుకు పెట్టారో పూర్తివిచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు . ఇక్కడి సూపరింటెండెంట్ సెప్ట్టె్టంబర్లో 116 బిల్లులు పెండింగ్‌లో పెట్టినట్టు తెలిసిందన్నారు. 282 బిల్లులు తన వద్ద ఉంచుకుని రికార్డులో నమోదు చేయలేదని వెల్లడించారు.