Earthquake : దేశ రాజధాని ఢిల్లీలో భూమి ఒక్కసారిగా కంపించింది. ఢిల్లీ – ఎన్సీఆర్తో పాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 9.50 పీఎం(మాగ్నిట్యూడ్ ఎర్త్‌క్వేక్)గా నమోదైంది. భూమి కంపించడంతో ఇళ్లు, ఆఫీసుల నుంచి జనం ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు.
ఢిల్లీతో సహా పంజాబ్‌లోని నోయిడా, ఛండీగఢ్, లూధియానాలో భూకంపం ప్రకంపనలు రేపింది. పూంచ్, శ్రీనగర్, ఉదమ్‌పూర్, జమ్ము కశ్మీర్‌లోనూ భూమి స్వల్పంగా కంపించింది. కొన్ని సెకన్ల పాటు తమ నివాసాలు ఊగిపోయాయని, ఇంట్లోని వస్తువులు కింద పడిపోయాయని.. తాము చాలా భయపడ్డామని కొందరు స్థానికులు తెలిపారు. అయితే.. భూకంపం కేంద్ర, తరంగాల ప్రభావం.. భూకంపం తీవ్రత గురించిన వివరాలు తెలియాల్సి ఉంది.