CSK vs PBKS | చెపాక్‌లో మాత్రే, దూబే విధ్వంసం.. పంజాబ్ ముందు భారీ లక్ష్యం..!
CSK vs PBKS : సొంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ కుర్రాళ్లు కుమ్మేశారు. చెపాక్‌లో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన ఆయుష్ మాత్రే(73) అర్ధ శతకంతో కదం తొక్కగా.. పంజాబ్ కింగ్స్ బౌలర్లకు సర్ఫరాజ్ ఖాన్(32) దడ పుట్టించాడు.
CSK vs PBKS : సొంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ కుర్రాళ్లు కుమ్మేశారు. చెపాక్‌లో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన ఆయుష్ మాత్రే(73) అర్ధ శతకంతో కదం తొక్కగా.. పంజాబ్ కింగ్స్ బౌలర్లకు సర్ఫరాజ్ ఖాన్(32) దడ పుట్టించాడు. మాత్రే మెరుపులతో డీలా పడిన ప్రత్యర్థిని డెత్ ఓవర్లలో శివం దూబే(45 నాటౌట్) మరింత కుంగదీసేలా బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఈ ముగ్గురి విధ్వంసంతో రెండొందలు కొట్టిన చెన్నై.. భారీ స్కోర్‌తో పంజాబ్‌కు సవాల్ విసిరింది.
తొలి మ్యాచ్‌లో విఫలమైన ఓపెనర్ సంజూ శాంసన్(7) చెపాక్‌లోనూ నిరాశపరిచాడు. అయినా చెన్నై ఆటగాళ్లు ఒత్తిడిలో పడకుండా ఖతర్నాక్ బ్యాటింగ్‌తో పంజాబ్ కింగ్స్ బౌలర్ల భర తం పట్టారు. అండర్-19 వరల్డ్‌కప్ కెప్టెన్ ఆయుష్ మాత్రే(73) సారథి రుతురాజ్ గైక్వాడ్(28)తో కలిసి చెలరేగిపోయాడు. హ్యాట్రిక్ ఫోర్లతో.. కళాత్మక సిక్సర్లతో అలరించిన మాత్రే 29 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. రెండో వికెట్‌కు 55 బంతుల్లో 96 రన్స్ జోడించిన ఈ ద్వయాన్ని చాహల్ విడదీసి పంజాబ్‌కు ఊరటనిచ్చాడు.
సర్ఫరాజ్ మెరుపులు
మాత్రే ఔటయ్యాక వచ్చిన కార్తిక్ శర్మ(1)ను యాన్సెన్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. సర్ఫరాజ్ ఖాన్(32) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తొలి మ్యాచ్‌లో ఇంప్యాక్ట్ చూపలేకపోయిన అతడు ఈసారి టీ20 బ్యాటర్లా రెచ్చిపోయాడు. అర్ష్‌దీప్, విజయ్‌కుమార్ ఓవర్లలో హ్యాట్రిక్ బౌండరీలతో అలరించగా స్కోర్ 160 దాటింది.
Sarfaraz Khan’s innovation 🤯
or Shivam Dube’s power 💪@ChennaiIPL fans, what did you enjoy the most? 🤔Updates ▶️ https://t.co/riWrE2EZiF#TATAIPL | #KhelBindaas | #CSKvPBKS pic.twitter.com/udWr3XcYWn
— IndianPremierLeague (@IPL) April 3, 2026
ప్రమాదకరంగా మారిన సర్ఫరాజ్‌ను షార్ట్ బంతితో విజయ్‌కుమార్ బోల్తా కొట్టించాడు. శివం దూబే(45 నాటౌట్) తన స్టయిల్లో ఫోర్లు, సిక్సర్ల మోత మోగించాడు. అర్ష్‌దీప్ వేసిన చివరి ఓవర్లో దూబే మూడు ఫోర్లు కొట్టడం, ప్రత్యర్ధి ముందు చెన్నై 210 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

