పాలమూరు : మహబూబ్‌గర్ పట్టణంలోని ప్రమోదగిరి ఉత్తరాది మఠంలో శుక్రవారం లోక కళ్యాణాన్ని ఆకాంక్షిస్తూ ఉత్తరాది మఠం పీఠాధిపతులు శ్రీ సత్యాత్మతీర్థ శ్రీ పాదులచే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి క్షీరాభిషేకం, మహా మంగళహారతి ప్రత్యేక పూజలను జరిపించారు. సుమద్వ విజయం పరాయి మంగళం అనంతరం సౌరభ దాస విద్యాలయం నిర్వహించిన అన్ని వర్గాల పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు స్వామిజీ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందించారు.
నూతన ప్రవేశం పొందిన అభ్యర్థులకు పుస్తకాలను అందించారు. వచ్చిన భక్తులకు ఫల మంత్ర అక్షింతలను అందించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాది మఠం నిర్వహణ అధికారి జోషి ఆనందాచార్యులు, మేనేజర్ ప్రశాంతచార్యులుతోపాటు పట్టణంలోని భక్తులు పాల్గొన్నారు.