BCCI : సొంతగడ్డపై వరుసగా 18వ టెస్టు సరీస్ విజయం సాధించిన ఆనందాన్ని న్యూజిలాండ్ జట్టు ఆవిరి చేసింది. ఈ 12 ఏండ్లలో ఏ జట్టుకు సాధ్యం కాని ఘనతను సొంతం చేసుకుంటూ.. మూడు టెస్టుల సిరీస్‌లో టీమిండియాను వైట్ వాష్ చేసింది. స్వదేశంలో భారత జట్టుకు ఘోర పరాభవం ఎదురవ్వడాన్ని అభిమానులే కాదు మాజీ క్రికెటర్లు కూడా జీర్ణించుకోవడం లేదు. అంతచిక్కని ఈ దారుణ ఓటమిని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సైతం సీరియస్‌గా తీసుకుంది. కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మలతో సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించింది.
న్యూజిలాండ్ చేతిలో 3-0తో టెస్టు సిరీస్ ఓటమిపై గుర్రుగా ఉన్న బీసీసీఐ కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్‌లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గంభీర్ కోచింగ్ విధానంపై కూడా బీసీసీఐ పెద్దలు మండిపడ్డారు. సుమారు ఆరుగంటల పాటు సాగిన సమీక్ష సమావేశంలో ఈ ఇద్దరి నిర్ణయాలను అధ్యక్షుడు రోజర్ బిన్ని, సెక్రటరీ జై షాలు తప్పుపట్టారు.
#TeamIndia came close to the target but it’s New Zealand who win the Third Test by 25 runs.
Scorecard – https://t.co/KNIvTEyxU7#INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/4BoVWm5HQP
— BCCI (@BCCI) November 3, 2024
‘అప్పటికే రెండు టెస్టుల్లో ఓటమి ఎదురైనా.. మళ్లీ స్పిన్ పిచ్ కావాలని ఎందుకు అడిగారు?’ సిరీస్‌లో కీలకమైన మూడో టెస్టుకు ‘జస్ప్రీత్ బుమ్రాకు ఎందుకు విశ్రాంతినిచ్చారు?’ అని గంభీర్, రోహిత్‌లను నిలదీశారు. గౌతీ, హిట్‌మ్యాన్‌లు వివరణ ఇచ్చినా సరే క్లీన్‌స్వీప్ కావడం మాత్రం తీవ్రగా పరిగణించాల్సిన విషయమని బీసీసీఐ అధ్యక్షుడు, సెక్రటరీలు తేల్చి చెప్పారు.
బంగ్లాదేశ్‌పై 2-0తో టెస్టు సిరీస్ గెలుపొందిన టీమిండియాకు న్యూజిలాండ్ దిమ్మదిరిగే షాకిచ్చింది. చిన్నస్వామి స్టేడియంలో భారత్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌట్ చేసిన కివీస్.. ఆ మ్యాచ్‌లో రచిన్ రవీంద్ర సూపర్ సెంచరీతో కోలుకొని 8 వికెట్ల తేడాతో 8 విజయభేరి మోగించింది. ఇక టర్నింగ్ ట్రాక్ అయిన పుణేలో కూడా న్యూజిలాండ్‌దే పైచేయి అయింది. మిచెల్ శాంట్నర్ 13 వికెట్లతో విజృంభించగా రోహిత్ సేనకు ఓటమి తప్పలేదు.
ఇక వైట్‌వాష్ తప్పాలంటే గెలుపే లక్ష్యంగా వాంఖడేలో బరిలోకి దిగిన భారత జట్టు అనూహ్యంగా తడబడింది. రిషభ్ పంత్ అర్ధ శతకంతో పోరాడినా గెలిపించలేకపోయాడు. అజాజ్ పటేల్ తిప్పేయడంతో భారీ ఓటమితో తొలిసారి స్వదేశంలో వైట్‌వాష్‌కు గురైంది. అంతేకాదు మూడింటా ఓడిన రోహిత్ సేన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. కివీస్‌పై ఒక్క మ్యాచ్‌లోనూ గెలవని భారత్ డబ్ల్యూటీసీ పట్టికలో అగ్రస్థానం కోల్పోయింది.
Mumbai-born Ajaz Patel returned to his home city as a member of New Zealand’s Test squad
He has now left his mark at Wankhede stadium 👏 #INDvNZ pic.twitter.com/p0LGkJpkho
— ESPNcricinfo (@ESPNcricinfo) December 4, 2021