CPL 2025 : ఐపీఎల్లో విధ్వంసక బ్యాటింగ్‌తో అలరిస్తున్న షెర్ఫానే రూథర్‌ఫొర్డ్ (Sherfane Rutherford) కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL 2025)లోనూ చెలరేగేందుకు సిద్ధమవుతున్నాడు. స్వదేశంలో జరుగబోయే ఈ టోర్నమెంట్లో అతడిని బార్బడోస్ రాయల్స్ (Barbados Royals) దక్కించుకుంది. సెయింట్ కిట్స్ నెవిస్ పేట్రియాట్స్ ఫ్రాంచైజీ ఈ హిట్టర్‌ను ట్రేడ్ పద్ధతిన బార్బడోస్‌కు అప్పగించింది. అందుకు ప్రతిగా.. జేసన్ హోల్డర్, అలిక్ అథనాజెలను ఆ ఫ్రాంచైజీ నుంచి సెయింట్ కిట్స్ తీసుకుంది. నిరుడు వివాదాస్పదంగా సీపీఎల్ నుంచి వైదొలిగాడు.
టీ20 హిట్టర్‌గా పేరొందిన రూథర్‌ఫొర్డ్ 18వ సీజన్ ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) తరపుముక్కగా అవతరించాడు. ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా వస్తూ.. మెరుపు ఇన్నింగ్స్‌లతో గుజరాత్ ప్లే ఆఫ్స్ చేరడంలో కీలక పాత్ర పోషించాడీ చిచ్చరపిడుగు. బార్బడోస్ రాయల్స్ స్క్వాడ్‌లో రొవ్మన్ పావెల్, డేవిడ్ మిల్లర్ (David Miller), క్వింటన్ డికాక్, రకీమ్ కార్న్‌వాల్ వంటి పవర్ హిట్టర్లు ఉన్నారు.
Power-hitter. Finisher. And he’s just turned Pink! 🔥
Welcome to your new home, Sherfane Rutherford 💗 pic.twitter.com/KuzDU3SODo
— Barbados Royals (@BarbadosRoyals) May 20, 2025
భీకర ఫామ్‌లో ఉన్న రూథర్‌ఫొర్డ్ చేరనుండడంతో రాయల్స్ బ్యాటింగ్ యూనిట్ మరింత బలోపేతం కానుంది. కరీబియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ ఆగస్టు 14న ప్రారంభం కానుంది. ఆరు జట్లు పోటీపడనున్న ఈ టోర్నీలో విజేత ఎవరో సెప్టెంబర్ 21న తెలిసిపోనుంది.