IPL 2025 : ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు ఆచితూచి ఆడుతున్నారు. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (36)బౌల్డ్ కావడంతో.. స్కోర్ వేగం మందగించింది. .కెప్టెన్ సంజూ శాంసన్(9), వైభవ్ సూర్యవంశీ(11)లు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. అన్షుల్ వేసిన 6వ ఓవర్ చివరి బంతిని వైభవ్.. చక్కని కవర్ డ్రైవ్‌తో బౌండరీకి తరలించాడు. దాంతో, రాజస్థాన్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది. ఇంకా విజయానికి 84 బంతుల్లో 132 పరుగులు కావాలి.
సూపర్ కింగ్స్ నిర్దేశించిన 188 పరుగులు ఛేదనలో రాజస్థాన్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్() దంచికొట్టాడు. ఖలీల్ అహ్మద్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్ తొలి బంతిని బౌండరీకి పంపాడు. ఆ తర్వాత అన్షులో బౌలింగ్‌లో సిక్సర్ బాదాడు.
Responding in a cracking manner 💥
Yashasvi Jaiswal is up and running in the chase 🏃
Updates ▶ https://t.co/hKuQlLxjIZ #TATAIPL | #CSKvRR | @ybj_19 pic.twitter.com/NzVLpnyBSj
— IndianPremierLeague (@IPL) May 20, 2025
అనంతరం ఖలీల్ బౌలింగ్‌లో వరుసగా 4, 4, 6, 4 బాది 19 రన్స్ పిండుకున్నాడు. ఆదే ఊపులో ఆడబోయిన అతడిని కంబోజ్ బౌల్డ్ చేసి చెన్నై సూపర్ కింగ్స్‌కు తొలి వికెట్ అందించాడు. దాంతో, రాజస్థాన్ స్కోర్ వేగం తగ్గిపోయింది.