IPL 2025 : ఐపీఎల్ రికార్డు బ్రేకర్ వైభవ్ సూర్యవంశీ (55 నాటౌట్) మరోసారి బ్యాట్ ఝులిపించాడు. అరుణ్ జైట్లీ మైదానంలో సూపర్ కింగ్స్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ అర్ధ శతకం సాధించాడు. సిక్సర్లతో హోరెత్తిస్తున్న ఈ యంగ్‌స్టర్.. నూర్ అహ్మద్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాది 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. ఈ సీజన్లో వైభవ్‌కు ఇది రెండో ఫిఫ్టీ. అనుభవజ్ఞులైన చెన్నై బౌలర్లను ఉతికారేసిన ఈ చిచ్చరపిడుగు మెరుపు హాఫ్ సెంచరీలో 4 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.
కెప్టెన్ సంజూ శాంసన్(41 నాటౌట్)తో కలిసి మూడో వికెట్‌కు 97 పరుగులు జోడించాడీ హిట్టర్. 13 ఓవర్లకు రాజస్థాన్ 2 వికెట్ల నష్టానికి 134 రన్స్ చేసింది. ఇంకా సంజూ సేన విజయానికి 54 పరుగులు కావాలి. ఈ ద్వయం మరో 5 ఓవర్లు నిలబడితే రాజస్థాన్ గెలుపు నల్లేరు మీద నడక కానుంది.
No fear and pressure 🙅
Just pure finesse 😎Vaibhav Suryavanshi with a scintillating fifty in the chase 🔥
Updates ▶ https://t.co/hKuQlLxjIZ #TATAIPL | #CSKvRR | @rajasthanroyals pic.twitter.com/YUsYYeCQC0
— IndianPremierLeague (@IPL) May 20, 2025
సూపర్ కింగ్స్ నిర్దేశించిన 188 పరుగులు ఛేదనలో రాజస్థాన్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(36) దంచికొట్టాడు. ఖలీల్ అహ్మద్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్ తొలి బంతిని బౌండరీకి పంపాడు. ఆ తర్వాత అన్షులో బౌలింగ్‌లో సిక్సర్ బాదాడు. అనంతరం ఖలీల్ బౌలింగ్‌లో వరుసగా 4, 4, 6, 4 బాది 19 రన్స్ పిండుకున్నాడు. ఆదే ఊపులో ఆడబోయిన అతడిని కంబోజ్ బౌల్డ్ చేసి తొలి వికెట్ అందించాడు. దాంతో, రాజస్థాన్ స్కోర్ వేగం తగ్గిపోయింది. కెప్టెన్ సంజూ శాంసన్(9), వైభవ్ సూర్యవంశీ(11)లు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. అన్షుల్ వేసిన 6 వ ఓవర్ చివరి బంతిని వైభవ్.. చక్కని కవర్ డ్రైవ్‌తో బౌండరీకి తరలించాడు. దాంతో, రాజస్థాన్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది. పవర్ ప్లే జడేజా బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాదడంతో రాజస్థాన్ స్కోర్ 100 దాటింది.