Mashrafe Mortaza : ప్రభుత్వ కోటాలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో అల్లరి మూకలు చెలరేగిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఆందోళనలు సోమవారం మరింత హింసాత్మకంగా మారాయి. ఈ క్రమంలో కొందరు మాజీ కెప్టెన్, ప్రస్తుతం ఎంపీగా ఉన్న ముష్రఫే ముర్తాజా (Mashrafe Mortaza) ఇంటికి నిప్పు పెట్టారు. అంతేకాదు ప్రధాని షేక్ హసీనా (Shaikh Hasina) అధికారిక నివాసంలోకి చొరబడి నానా రచ్చ చేశారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతలు అదుపు తప్పడంతో సైన్యం రంగంలోకి దిగింది. ఆందోళనల నేపథ్యంలో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామాతో సైన్యం దేశాన్ని గుప్పిట్లోకి తీసుకుంది. బంగ్లాలో ఎప్పుడు సాధారణ రోజులు వస్తాయో తెలియడం లేదు.
Bangladesh former national captain and currently AL mp Mashrafe Mortaza’s house being burned down.. pic.twitter.com/hteebrdXcJ
— স্বাধীন বাংলা 🇧🇩 (@shishir_bin) August 5, 2024
ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో మరో రెండు నెలల్లో జరగాల్సిన మహిళల టీ20 వరల్డ్ కప్‌పై అనిశ్చితి నెలకొంది. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(0) అక్కడి ఉద్రిక్త పరిస్థితులను నిశితంగా గమనిస్తోంది. ఒకవేళ హింసాత్మక ఘటనలు ఇంకొన్ని రోజులు కొనసాగితే బంగ్లా నుంచి వరల్డ్ కప్ వేదికను తరలించే అవశాశముంది.