Gold-Silver Rates | దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. సోమవారం 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.250 వృద్ధితో రూ.72,800లకు పెరిగింది. జ్యువెల్లర్స్ నుంచి గిరాకీ పెరగడం వల్లే బంగారం ధర పెరిగిందని చెబుతున్నారు. ఇంతకు ముందు సెషన్లో తులం బంగారం ధర (24 క్యారట్స్) రూ.72,550 వద్ద ముగిసింది. మరోవైపు, వెండి ధరల్లో పతనం కొనసాగుతూనే ఉన్నది. వరుసగా మూడో రోజు కిలో వెండి ధర రూ.1300 తగ్గి రూ.84,200 వద్ద స్థిర పడింది. గత సెషన్ లో కిలో వెండి ధర రూ.85,500 వద్ద ముగిసింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 8.70 డాలర్లు పతనమై 2,461.10 డాలర్లు పలికింది. మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రేడర్లు అమ్మకాలకు దిగడంతో బంగారం ధర తగ్గుముఖం పటిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పర్మార్ తెలిపారు.
ఇదిలా ఉంటే మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో తులం బంగారం (గోల్డ్ ఫ్యూచర్స్) అక్టోబర్ కాంట్రాక్ట్స్ ధర రూ.309 తగ్గి రూ69,480 వద్ద నిలిచింది. మరోవైపు కిలో వెండి సెప్టెంబర్ డెలివరీ ధర రూ.2,719 పతనమై రూ.79,774 వద్ద ముగిసింది. ఇప్పటికీ అమెరికాలో వడ్డీరేట్లు అధిక స్థాయిలోనే కొనసాగుతుండటంతో బంగారానికి ఇన్వెస్టర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు లభిస్తుందని ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ అండ్ కరెన్సీ రీసెర్చ్ అనలిస్ట్ వైస్ ప్రెసిడెంట్ జతిన్ త్రివేది తెలిపారు. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో దేశీయ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధరలు రూ.69 వేల నుంచి రూ.71 వేల మధ్య తచ్చాడుతాయని అంచనా వేశారు.