Pushpa 2 The Rule | పుష్ప దిరై జ్ చిత్రంతో అంతర్జాతీయంగా సినీ ప్రేక్షకులు ప్రశంసలు అందుకున్న కథానాయకుడు అల్లు అర్జున్ (Allu Arjun). ఈ చిత్రంతోనే 80 ఏళ్ల సినీ చరిత్రలో ఉత్తమ నటుడిని ఊరిస్తున్న కేంద్ర జాతీయ అవార్డు కూడా ఈ అల్లు వారసుడు కైవసం చేసుకుని.. తెలుగు సినిమ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టించాడు. ఇక పుష్ప తెరకెక్కించి బన్నీ సక్సెస్‌లో సగ భాగంగా నిలిచిన దర్శకుడు సుకుమార్.. ఈ ఐకాన్‌స్టార్‌తో పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule) పేరుతో పుష్పకు సీక్వెల్‌ను తయారుచేస్తున్నాడు.
ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కావాలనే ఎంతో పకడ్భందీగా క్వాలిటీ అవుట్‌పుట్ కోసం ప్రయత్నిస్తున్నాడు సుకుమార్. రష్మిక మందన్నా, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్‌లు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే మొదట్లో ఈ చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
అయితే కొన్ని కారణాల వల్ల చిత్రం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ వుండటంతో చిత్రాన్ని వాయిదా వేయాలని నిర్ణయించారు. అయితే ఎన్నో తర్జన భర్జనల మధ్య డిసెంబరు 6న చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే సాధారణంగా సినీ పరిశ్రమలో సెంటిమెంట్లు ఎక్కువగా నమ్ముతుంటారు. అందుకే గతంలో పుష్ప దిరైజ్ డిసెంబర్ 17న విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది.
అందుకే సెంటిమెంట్ తమకు డిసెంబరు నెల కలిసి వస్తుందని నిర్మాతలు, హీరో భావించడంతో డిసెంబర్ 6న రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేశారు. అయితే మొదట్లో నవంబరులో లేదా జనవరిలో అనుకున్నారు కానీ.. డిసెంబరు సెంటిమెంట్ కారణంగానే ఈ డేట్‌కు మొగ్గు చూపారని అంటున్నారు బన్నీ సన్నిహితులు. ఇక అందరూ అనుకున్నట్లు సెంటిమెంట్ వర్క్‌వుట్ అయిట్ పుష్ప-2 ది రైజ్ సంచలన విజయం సాధించాలని కోరుకుందాం..
Kalinga Teaser | అక్కడికి పోవడమే కానీ రావడం ఉండదు.. థ్రిల్లింగ్‌గా కళింగ టీజర్
Simbaa | స్టేజ్‌పై ఎమోషనల్ అయిన జగపతిబాబు సింబా డైరెక్టర్
Mr Bachchan | రొమాంటిక్ లుక్‌తో రవితేజ మిస్టర్ బచ్చన్ ట్రైలర్ టైం చెప్పిన మేకర్స్
Sardar 2 | ఆ వార్తలే నిజమయ్యాయి.. కార్తీ సర్దార్ 2లో హీరోయిన్ ఫైనల్..!