Kalinga Teaser | కంటెంట్, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలను మూవీ లవర్స్ ఆదరిస్తారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ జోనర్‌లోనే ప్రేక్షకులను ఇంప్రెస్ చేసేందుకు పాన్ ఇండియా ప్రాజెక్టు కళింగ (Kalinga)తో వస్తున్నాడు కిరోసిన్ ఫేం ధ్రువ వాయు. స్వీయదర్శకత్వంలో ధ్రువ వాయు లీడ్ రోల్లో నటిస్తున్న కళింగ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్లో చేతిలో కాగడ పట్టుకొని ఉండగా.. బ్యాక్ డ్రాప్లో లక్ష్మినరసింహస్వామి ఉగ్రరూపంలో కనిపిస్తున్నాడు.
తాజాగా కళింగ టీజర్‌ను బాలీవుడ్ స్టార్ యాక్టర్ జాకీ ష్రాఫ్ లాంచ్ చేశాడు. ఓ బాలిక ఒళ్లు గగుర్పొచేలా తన చెవిని తానే కొరుక్కుని తినే సన్నివేశంతో షురూ అయింది టీజర్. యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో.. సంస్థానం అనేది పద్మవ్యూహం.. అక్కడికి పోవడమే కానీ రావడం ఉండదంటూ వచ్చే సంభాషణలతో కట్ చేసిన టీజర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
ఈ మూవీలో ప్రగ్యా నయన్ హీరోయిన్గా నటిస్తోంది. మురళీ ధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, తనికెళ్లభరణి, బలగం సుధాకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి విష్ణు శేఖర, అనంత నారాయణన్ ఏజీ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దీప్తి కొండవీటి, పృథ్వియాదవ్ తెరకెక్కిస్తున్నారు.
కళింగ టీజర్..
🌟 Big News Alert! 🌟 Akshay Kumar is all set for his Telugu debut in our highly-anticipated Pan India venture, “Kannappa,” @iVishnuManchu @themohanbabu#Prabhas @akshaykumar @mukeshvachan pic.twitter.com/n0UBqMuPUr
— SR Promotions (@SR_Promotions) April 16, 2024
Kangana Ranaut | ఖరీదైన విల్లాను అమ్మకానికి పెట్టిన కంగనారనౌత్..?
Sardar 2 | ఆ వార్తలే నిజమయ్యాయి.. కార్తీ సర్దార్ 2లో హీరోయిన్ ఫైనల్..!