Simbaa | టాలీవుడ్ యాక్టర్లు జగపతిబాబు (Jagapathi Babu), అనసూయ లీడ్ రోల్స్‌లో నటిస్తోన్న ప్రాజెక్ట్ సింబా (Simbaa). మురళీ మనోహర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంపత్ నంది కథను అందించాడు. సింబా ఆగస్ట్ 9న విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ రిలీజ్ ట్రైలర్‌ను లాంచ్ చేశారని తెలిసిందే.
సంపత్ నంది దగ్గర దర్శకత్వ శాఖలో పలు చిత్రాలకు పనిచేసిన మురళీమనోహర్ చాలా కాలానికి ఈ సినిమాతో డైరెక్టర్‌గా మారడంతో తన ప్రయాణాన్ని గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యాడు. సింబా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మురళీ మనోహర్ మాట్లాడుతూ.. ఈ స్టేజీ వరకు రావడం చాలా పెద్ద టాస్క్. ఎప్పుడూ నాపై నమ్మకముంచి నా విజన్‌కు సపోర్టుగా నిలిచిన నా కుటుంబానికి ధన్యవాదాలు. ఆర్టిస్టులందరికీ థ్యాంక్స్ అంటూ మాటలు రాక పక్కకు వెళ్లిపోయాడు డైరెక్టర్. పర్యావరణ ప్రాధాన్యతను తెలియజేస్తూ సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రాన్ని సంపత్‌నంది, దాసరి రాజేందర్ రెడ్డి నిర్మించారు.
ప్రపంచంలో ఎయిర్ పొల్యూషన్ వల్ల 65శాతం మంది చనిపోతున్నారు. సిగరెట్, మందు కంటే దుమ్ము వల్ల చనిపోయేది పాతికరెట్లు ఎక్కువ. మొక్కలు మనతోనే ఉంటాయి. మనతో పాటు పెరుగుతాయి. మన తరువాత కూడా ఉంటాయి’ అనే డైలాగ్స్‌తో కట్ చేసిన ట్రైలర్ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేస్తూ.. పర్యావరణ ప్రాముఖ్యత తెలియజేస్తూ సాగుతోంది.
సింబా రిలీజ్ ట్రైలర్ ..
Kangana Ranaut | ఖరీదైన విల్లాను అమ్మకానికి పెట్టిన కంగనారనౌత్..?
Sardar 2 | ఆ వార్తలే నిజమయ్యాయి.. కార్తీ సర్దార్ 2లో హీరోయిన్ ఫైనల్..!