Mr Bachchan |టాలీవుడ్ యాక్టర్ రవితేజ (Ravi Teja) – హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకున్నాయని తెలిసిందే. ఈ ఇద్దరూ మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan) సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఇప్పటికే లాంచ్ చేసిన పోస్టర్లు, టీజర్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా రవితేజ, భాగ్య శ్రీ బోర్సే రొమాంటిక్ లుక్‌తో ట్రైలర్ ఎప్పుడు చెప్పారు మేకర్స్.
మిస్టర్ బచ్చన్ ట్రైలర్‌ను ఆగస్టు 7న విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఈ లుక్ ఆన్లైన్లో హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రవితేజ, భాగ్యశ్రీ బోర్సే కాంబోలో వచ్చే సితార్, రెప్పల్ డప్పుల్ సాంగ్స్ మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఇక టీజర్లో సక్సెస్,ఫెయిల్యూర్ చుట్టాల్లాంటివి.. వస్తుంటాయ్.. పోతుంటాయ్.. యాటిట్యూడ్ ఇంటిపేరు లాంటిది.. అది పోయేదాకా మనతోనే ఉంటుందని రవితేజ స్టైల్లో సాగుతున్న డైలాగ్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.
ఈ మూవీకి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. పనోరమా స్టూడియోస్, టీ-సిరీస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. రవితేజ బిగ్‌బి అమితాబ్‌బచ్చన్‌కు వీరాభిమాని కగా.. కథానుగుణంగా బిగ్ బీ అభిమానిగా కనిపించనున్నట్టు ఇన్సైడ్ టాక్. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది.
#MrBachchan MASS MAHA TRAILER on August 7th 🔥 pic.twitter.com/pcq8kv0pVm
— Ravi Teja (@RaviTeja_offl) August 5, 2024
Kangana Ranaut | ఖరీదైన విల్లాను అమ్మకానికి పెట్టిన కంగనారనౌత్..?
Sardar 2 | ఆ వార్తలే నిజమయ్యాయి.. కార్తీ సర్దార్ 2లో హీరోయిన్ ఫైనల్..!