Kanpur Test : క్రికెట్ అనే కాదు ప్రతి ఆటలో ఓ జట్టుకు ‘సూపర్ ఫ్యాన్స్’ ఉంటారు. తమ టీమ్ ఎక్కడ ఆడినా సరే సదరు అభిమానులు స్టాండ్స్‌లో ప్రత్యక్షమై నానా హంగామా చేస్తారు. తమ దేశపు జెండా రంగులు లేదా భిన్నమైన వేషధారణలతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. అయితే.. కొన్నిసార్లు వాళ్లకు ఇతర అభిమానుల నుంచి ప్రమాదం పొంచి ఉంటుంది. తాజాగా అలాంటి సంఘటనే జరిగింది. బంగ్లాదేశ్ జట్టు సూపర్ ఫ్యాన్.. అదేనండీ ‘టైగర్ రాబీ'(Tiger Roby) అనూహ్యంగా దవాఖాన పాలయ్యాడు.
కాన్పూర్‌లో భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య రెండో టెస్టు జరిగింది. దాంతో, టైగర్ రాబీ.. ఎప్పటిలానే పులి వేషధారణను తలపించేలా డ్రెస్ వేసుకొని.. ముఖానికి పసుపు రంగు. అక్కడక్కడా నలుపు రంగును చారలుగా రుద్దుకొని స్టేడియంలోకి వచ్చాడు. అయితే.. ఏమైందో తెలియదు తొలిరోజు స్టాండ్స్‌లో బంగ్లాదేశ్ ఆటగాళ్లను కాసేపు ఉత్సాహపరిచాడు. ఎందుకనో తెలియదు తన నోటికి పని చెబుతూ.. బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న భారత పేసర్ మహ్మద్ సిరాజ్‌ను దూషించాడు. దాంతో, చిర్రెత్తుకొచ్చిన ఇండియన్ ఫ్యాన్స్ బంగ్లా వీరాభిమానికి తమ స్టయిల్లో బుద్ది చెప్పారు. మా క్రికెటర్‌నే తిడతావా? అంటూ టైగర్ రాబీని దారుణంగా కొట్టారు.
🤡 Bangladeshi fan Tiger Roby
– In Chennai he was openly shouting India=enemy, ICC=BCCI.
– In Kanpur he abused Siraj
Kanpur crowd had it enough and replied him in a language he understands.
Now entire Bangladesh is playing victim card as usual.
pic.twitter.com/A5go15Hmyn— Johns (@JohnyBravo183) September 27, 2024
 
VIDEO | Bangladesh cricket team’s ‘super fan’ Tiger Roby was allegedly beaten up by some people during the India-Bangladesh second Test match being played at Kanpur’s Green Park stadium. He was taken to hospital by the police. More details are awaited.#INDvsBAN #INDvsBANTEST… pic.twitter.com/n4BXfKZhgy
— Press Trust of India (@PTI_News) September 27, 2024
;
దాంతో, పోలీసులు టైగర్ రాబీని వెంటనే హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. అసలు బంగ్లా సూపర్ ఫ్యాన్ఫై దాడికి కారణం ఏంటీ? అతడిని ఎవరు కొట్టారు? అనేది తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే.. తనపై దాడి గురించి టైగర్ రాబీ తమకు అసలేం జరిగిందో చెప్పలేదని.. కానీ, అతడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడని ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధికారి వెల్లడించాడు.
భారత పర్యటనలో తొలి టెస్టులో దారుణంగా ఓడిన బంగ్లాదేశ్ రెండో టెస్టులోనూ తడబడింది. యువ పేసర్ ఆకాశ్ దీప్(2/34) విజృంభణకు ఆదిలోనే టకటకా రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ముష్ఫికర్ రహీం(6 నాటౌట్), మోమినుల్ హక్(40 నాటౌట్)లు జాగ్రత్తగా ఆడి ఇన్నింగ్స్ నిర్మించారు. అయితే.. భారత జోరుకు వరుణుడు అడ్డుపడ్డారు. మూడో సెషన్లో వర్షం కారణంగా తొలి రోజు ఆటను రద్దు చేశారు అంపైర్లు. అప్పటికీ బంగ్లా స్కోర్.. 107/3.
UPDATE 🚨
Due to incessant rains, play on Day 1 has been called off in Kanpur.
Scorecard – https://t.co/JBVX2gyyPf#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/HSctfZChvp
— BCCI (@BCCI) September 27, 2024