IPL 2025 : టీ20లకు వీడ్కోలు పలికిన విండీస్ దిగ్గజం డ్వేన్ బ్రావో (Dwayne Bravo)కు బంపరాఫర్ వచ్చింది. రిటైర్మెంట్ రోజే అతడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్టుకు మెంటర్‌గా ఎంపికయ్యాడు. అది కూడా ఈ ఏడాది గౌతం గంభీర్ (Gautam Gambhir) ఆధ్వర్యంలో కప్ కొట్టిన కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders)కు. ఈ విషయాన్ని శుక్రవారం కోల్‌కతా యాజమాన్యం అధికారికంగా వెల్లడించింది. బ్రావో కూడా కోల్‌కతా మెంటర్‌గా పనిచేసేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానని అన్నాడు.
‘నేను గత 10 ఏండ్లుగా కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ట్రిన్బగో నైట్ రైడర్స్‌కు ఆడాను. వివిధ లీగ్స్‌లో నైట్ రైడర్స్ జట్టు తరఫున కొన్నిసార్లు, ఆ జట్టుకు ప్రత్యర్థిగా కొన్ని పర్యాయాలు ఆడాను. కోల్‌కతా ఫ్రాంచైజీ పనితీరు అంటే నాకు చాలా గౌరవం. క్రికెట్ అంటే వాళ్లకున్న అమితమైన ఇష్టం, నిర్వహణ విధానం, కుటుంబం లాంటి వాతావరణం ఇవన్నీ చాలా బాగుంటాయి.
🚨 Attention #KnightsArmy, this is your mentor, Sir Champion speaking 🎙️ pic.twitter.com/Naa2c7cU0z
— KolkataKnightRiders (@KKRiders) September 27, 2024
మెంటార్‌గా, కోచ్‌గా భావి తరాన్ని తీర్చిదిద్దేందుకు నాకు ఇదే సరైన అవకాశం’ అని బ్రావో వెల్లడించాడు. మొదట గంభీర్ ప్లేస్‌లో లెజెండరీ ఆల్‌రౌండర్ జాక్వెస్ కలిస్(Jacques Kallis) మెంటార్‌గా వస్తాడనే వార్తలు వినిపించాయి. కానీ, అనూహ్యంగా బ్రావో పేరు తెరపైకి వచ్చింది. సిస్టర్ ఫ్రాంచైజీ అయిన ట్రిన్బగో నైట్ రైడర్స్(TNR)కు ఆడిన అనుభవం.. కోల్‌కతా యాజమాన్యంతో అతడికి గల అనుబంధం కారణంగానే మెంటర్‌గా అవకాశం కొట్టేశాడు బ్రావో. ఇప్పటివరకూ బ్రావో ఐపీఎల్, కరీబియన్ లీగ్, ఇంటర్నేషనల్ లీగ్.. ఇవన్నీ కలిపి 582 టీ20ల్లో ఆడాడు. బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన విండీస్ వీరుడు మొత్తంగా 631 వికెట్లు పడగొట్టడమే కాదు 7 వేల పరుగులు సాధించాడు.
Here’s to creating more ‘Champion’™️ memories! 💜@VenkyMysore | @DJBravo47 pic.twitter.com/KweWi895Ug
— KolkataKnightRiders (@KKRiders) September 27, 2024
పొట్టి ఫార్మాట్లో బ్రావోకు గొప్ప రికార్డు ఉంది. వెస్టిండీస్ తరఫున రెండు టీ20 వరల్డ్ కప్‌లు గెలుపొందిన బ్రావో ఐపీఎల్లో అదరగొట్టాడు. ముంబై ఇండియన్స్(Mumbai Indians), చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఫ్రాంచైజీలకు ఆడిన అతడు అత్యధిక వికెట్ల వీరుడిగా పేరొందాడు. ఐపీఎల్లో ఈ వెటరన్ ఆల్‌రౌండర్ 161 మ్యాచ్‌లు ఆడి 183 వికెట్లు తీశాడు. బ్యాటుతోనూ విధ్వంస సృష్టిస్తూ 1,560 రన్స్ చేశాడు. ఈ లీగ్‌లో అతను 5 అర్థ సెంచరీలు ఉన్నాయి.
ఇక కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో అతడు ఏకంగా ఐదు సార్లు ట్రోఫీ అందుకున్నాడు. అది కూడా ట్రిన్బగో నైట్ రైడర్స్ తరఫున అతడు మూడు టైటిళ్లు ముద్దాడాడు. అతడి కెప్టెన్సీలో 2017, 2018లో టీకేఆర్ జట్టును చాంపియన్‌గా అవతరించింది. ఆ తర్వాత పేట్రియాట్స్ జట్టును నడిపించిన బ్రావో 2021లో విజేతగా నిలిపాడు.