Bigg Boss Telugu 8 | బిగ్‌బాస్ సీజన్ 8 రసవత్తరంగా సాగుతుంది. ఇప్పటికే హౌస్ నుంచి, బేబక్కతో పాటు తెలంగాణ పోరడు అభయ్, శేఖర్ భాషా ఎలిమినేషన్ అవ్వగా.. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అని అటు అభిమానులతో పాటు హౌస్మేట్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ వారంలో ఓటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుంది? డేంజర్ జోన్లో ఎవరున్నారు అనేది చూసుకుంటే..
ఈ వారం ఎలిమినేషన్ లిస్ట్‌లో 8 మంది నామినేట్ అయ్యారు. ఇందులో నబీల్, సోనియా ఆకుల, నాగ మణికంఠ, పృథ్వీరాజ్ శెట్టి, ఆదిత్య ఓం, ప్రేరణ, నైనికలు ఉన్నారు. అయితే, చీఫ్ నిఖిల్‌కు బిగ్ బాస్ ఇచ్చిన స్పెషల్ పవర్‌తో నైనికను సేవ్ చేశాడు. దీంతో ఈ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది.
ఎనిమిదో సీజన్ నాలుగో వారంలోని ఓటింగ్‌లో నబీల్ తన హవాను చూపిస్తున్నాడు. ఎక్కువమందితో కలవకపోయినా.. నబిల్ టాస్క్‌లు బాగానే ఆడుతున్నాడు. ముఖ్యంగా సోనియాకు ఇతను ఇచ్చే ఆన్సర్లుకు చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. మరీ ముఖ్యంగా నబీల్ అఫ్రిదీ ఒక్కడే దాదాపు 35 శాతం వరకూ ఓటింగ్ సాధిస్తూ మొదటి స్థానంలో ఉన్నాడు. ఇక నబీల్ తర్వాత ప్రేరణకు కూడా అత్యధిక ఓట్లు వచ్చాయి. గతవారంలో టాస్క్‌ల్లో ప్రేరణ బాగా ఆడింది. కానీ నోటిని కంట్రోల్ చేసుకోలేకోపోయింది. దీనివల్ల ఈ వారం నామినేషన్లోకి ఆమె కూడా రావాల్సి వచ్చింది. ఇక గురువారం ఎపిసోడ్ ముగిసిన తర్వాత మణికంఠకు ఓటింగ్ పెరిగి మూడో స్థానానికి చేరుకున్నాడు. అయితే ప్రతివారం లాగే ఈ వారం కూడా నామినేట్ అయ్యాడు మణికంఠ. పైగా ఇతనిని యశ్మీ ప్రతివారం నామినేట్ చేస్తానంటూ గతవారంలోనే చెప్పింది.
వీళ్ల తర్వాత అంటే నాలుగో స్థానంలో ఆదిత్య ఓం ఉన్నాడు. టాస్క్‌ల్లో పెద్దగా పాల్గొనకపోవడం వల్ల ఆదిత్య ఓం కూడా ఈ వారం నామినేషన్లో ఉన్నారు. పైగా ఈయనవల్ల పెద్దగా ఫుటేజ్ కూడా రావడంలేదనేది నిజం. ఐదో స్థానాలో పృథ్వీరాజ్ శెట్టి ఉన్నాడు. టాస్క్‌ల్లో ముందువెనుకా చూసుకోకుండా గేమ్ ఆడుతూ.. బూతులు మాట్లాడుతూ నామినేషన్లోకి వచ్చాడు పృథ్వీ. సోనియా అతని గేమ్‌ని బాగా డిస్టర్బ్ చేస్తుందని ఆడియన్స్ బాగా ఫీలవుతున్నారు. అలాగే అందరి కంటే చివర్లో అంటే ఆరో స్థానంలో సోనియా ఆకుల ఉంది. మరోవైపు ఈ వారం ఎలాగైనా సోనియాను పంపేయాలంటూ యూట్యూబ్ వీడియోల కింద పలువురు కామెంట్లు పెడుతున్నారు. ఈమె వెళ్తే అసలు మజానే ఉండదంటూ కొందరు చెప్తున్నారు. అయితే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.