అమరావతి : ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తుందని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan ) ఆరోపించారు. తాడేపల్లి నివాసం నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. దేవుడి వద్దకు వెళ్లే కార్యక్రమాన్ని అడ్డుకునే మనస్థత్యం నా రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు.
దేశంలో ఇలాంటి ఘటనలు జరిగి ఉండదని అన్నారు. జగన్ అనే వ్యక్తి తిరుమల (Tirumala) దర్శనానికి వస్తూంటే పోలీసులు (Police) వైసీపీకి చెందిన కార్పొరేటర్లు నాయకులకు నోటీసులు ఇవ్వడం ఆశ్చరకరమని దుయ్యబట్టారు . జగన్ పర్యటనకు అనుమతి లేనందున ఇందులో పాల్గొంటే చట్టరీత్యా నేరమని నోటీసులు ఇచ్చారని, . పాల్గొంటే అరెస్టు చేస్తామని నోటీసులు ఇవ్వడం దారుణమన్నారు. ఇది రాక్షసరాజ్యం కాదా అని ప్రశ్నించారు.
తన పర్యటనను అడ్డుకోవడానికి చుట్టూ పక్కల రాష్ట్రాల నుంచి బీజేపీ వాళ్లను రమ్మంటున్నారని , ఇది ఎంతవరకు సమంజసమని అన్నారు. తిరుమలలో వేల మంది పోలీసులును మోహరించారని ఆరోపించారు. రాష్ట్రంలో పరిస్థితుల నుంచి టాపిక్ డైవర్టు చేయడానికి తిరుపతి లడ్డూ అంశమని చంద్రబాబు తెరపైకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఈ ఆరోపణలు ఒక్కొక్కటి అబద్దమని తెలుస్తుండడంతో లడ్డూ వ్యవహారం నుంచి తప్పించుకోవడానికి డిక్లరేషన్ను తెరమీదకు తీసుకువచ్చారని విమర్వించారు.
రాజకీయ దుర్బుద్ధితోలడ్డూల తయారీ జంతువుల కొవ్వును కలిపారని, కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నంట్లుగా భయాందోళనలు సృష్టించారని ఆరోపించారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అబద్ధాలు, అసత్యాలు మాట్లాడుతున్నారని, తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు.