12th Fail | బాలీవుడ్ యంగ్ హీరో విక్రాంత్ మాస్సే (Vikranth Massey) నటించిన 12th ఫెయిల్ (12th Fail) చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. కేసుల విచారణకు వేదికగా ఉన్న దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court)లో ఈ చిత్రాన్ని తాజాగా ప్రదర్శించారు. సీజేఐతోపాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులు, రిజిస్ట్రీ అధికారుల కోసం ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు (special screening). అడ్మినిస్ట్రేషన్ భవనంలోని సి-బ్లాక్‌లో గల ఆడిటోరియంలో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. సీజేఐ డీవై చంద్రచూడ్ సహా 600 మంది న్యాయవాదులు, ఇతర అధికారులు ఈ చిత్రాన్ని వీక్షించారు.
ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ, ఐఆర్ఎస్ ఆఫీసర్ శ్రద్ధా జోష్ జీవిత కథ ఆధారంగా ఫిల్మ్‌ను తెరకెక్కించారు. విదు వినోద్ చోప్రా తీసిన 12th ఫెయిల్ సినిమా గతేడాది అక్టోబర్ 27వ తేదీన రిలీజైంది. హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో ఆ సినిమాను విడుదల చేశారు. చిన్న సినిమాగా విడుదలైన 12Th ఫెయిల్ చిత్రం పెద్ద సినిమాలకు పోటీనిస్తూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మనోజ్ పాత్రలో విక్రాంత్ మాసే నటించారు. మేధా శంకర్ హీరోయిన్ పాత్రను పోషించారు. అనురాగ్ పాఠక్ రాసిన నవల ఆధారంగా 12th ఫెయిల్ సినిమాను తీశారు.
విక్రాంత్ మాస్సే ఈ సినిమాలో మనోజ్ అనే IPS ఆస్పిరంట్(Aspirant)గా కనిపించాడు. చంబల్‌లోని ఒక చిన్న గ్రామం నుంచి ఢిల్లీలోని ముఖర్జీ నగర్‌కు UPSC ప్రిపరేషన్ కోసం వచ్చిన విక్రాంత్ అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనేది కథాంశం. ఇక UPSC కోసం ప్రయత్నించే లక్షలాది విద్యార్థుల నిజమైన కథల నుంచి ఈ చిత్రం రూపొందింది.
Also Read..
Killer wolfs | ఒంటరి తోడేలు వరుస దాడులు.. ఇద్దరు చిన్నారులకు గాయాలు
YS Jagan | బిగ్ బ్రేకింగ్.. జగన్ తిరుమల పర్యటన రద్దు
Deputy CM Bhatti | డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ