Bangladesh Super Fan : కాన్పుర్ టెస్టు సందర్భంగా బంగ్లాదేశ్ సూపర్ ఫ్యాన్ టైగర్ రోబి(Tiger Roby)పై దాడి కలకలం రేపింది. భారత పేసర్ మహమ్మద్ సిరాజ్(Mohammad Siraj)ను దూషించడం వల్లనే అతడిపై భారత ప్రేక్షకులు దాడి చేశారనే వార్తలు వైరల్ అయ్యాయి. అంతేకాదు.. సోయి తప్పి పడిపోయిన టైగర్ రోబిని పోలీసులు మోసుకుంటూ ఆస్పత్రికి తరలించిన దృశ్యాలు ఒకింత ఆందోళన కలిగించాయి. అయితే.. అసలు స్టేడియంలో జరిగింది వేరట. బంగ్లా అభిమానిని ఎవరూ కొట్టలేదట. మరి అతడు ఎందుకలా స్పృహ తప్పిపడిపోయాడో తెలుసా..?
రెండో టెస్టు తొలి రోజు దవాఖాన పాలైన బంగ్లాదేశ్ సూపర్ ఫ్యాన్ టైగర్ రోబీ తనకు ఏం జరిగిందో చెప్పాడు. వైద్యుల చికిత్స అనంతరం నోరు విప్పిన అతడు తనను ఎవరూ కొట్టలేదని, డీహైడ్రేషన్(Dehydration) కారణంగానే తాను స్పృహ తప్పానని అన్నాడు. ‘కాన్పూర్లో రెండో టెస్టు తొలిరోజు స్టేడియానికి వచ్చాక అనారోగ్యానికి గురయ్యాను. డీహైడ్రేషన్ కారణంగా సొమ్మసిల్లి కింద పడిపోయాను.
VIDEO | Bangladesh cricket team’s ‘super fan’ Tiger Roby was allegedly beaten up by some people during the India-Bangladesh second Test match being played at Kanpur’s Green Park stadium. He was taken to hospital by the police. More details are awaited.#INDvsBAN #INDvsBANTEST… pic.twitter.com/n4BXfKZhgy
— Press Trust of India (@PTI_News) September 27, 2024
నన్ను గమనించిన పోలీసులు వెంటనే దవాఖానకు తీసుకెళ్లారు. వైద్య చికిత్స తర్వాత నా ఆరోగ్యం కుదుటపడింది. నా పేరు రోబి. బంగ్లాదేశ్ నుంచి వచ్చాను’ అని టైగర్ రోబి మీడియాకు వివరించాడు. అతడి మాటలు విన్నాక ‘ఓస్.. జరిగింది ఇదా.. అనవసరంగా నోరుజారి దెబ్బలు తిన్నావని అనుకున్నాంగా’అని అంతా అనుకున్నారు.
భారత పర్యటనలో తొలి టెస్టులో దారుణంగా ఓడిన బంగ్లాదేశ్ రెండో టెస్టులోనూ తడబడింది. యువ పేసర్ ఆకాశ్ దీప్(2/34) విజృంభణకు ఆదిలోనే టకటకా రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ముష్ఫికర్ రహీం(6 నాటౌట్), మోమినుల్ హక్(40 నాటౌట్)లు జాగ్రత్తగా ఆడి ఇన్నింగ్స్ నిర్మించారు. అయితే.. భారత జోరుకు వరుణుడు అడ్డుపడ్డారు. మూడో సెషన్లో వర్షం కారణంగా తొలి రోజు ఆటను రద్దు చేశారు అంపైర్లు. అప్పటికీ బంగ్లా స్కోర్.. 107/3.
😮 When the giant screen showed three Reds ⭕⭕⭕
Akash Deep gets his second courtesy of a successful DRS!
Live – https://t.co/JBVX2gyyPf#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/ZyGJfgBdjW
— BCCI (@BCCI) September 27, 2024